Asianet News TeluguAsianet News Telugu

ఆడపిల్లను ప్రసవించిందని అత్తింటివారి వేధింపులు.. మూడు నెలల పాపను నీళ్ల ట్యాంకులో ముంచి..

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇప్పటికే ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఆ వివాహిత మరోసారి ఆడ పిల్లనే ప్రసవించడంతో అత్తింటవారు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. తరుచూ వేధింపులు చేస్తుండటంతో ఆ వివాహితనే కన్న బిడ్డను నీళ్ల ట్యాంకులో ముంచి చంపేసింది. కన్న బిడ్డను ట్యాంకులో ముంచేసి ఆమె పోలీసులకు ఓ కిడ్నాప్ కథను చెప్పింది. కానీ, చివరకు ఆమెనే నేరాన్ని అంగీకరించింది. 

in laws harassed for giving birth again to a baby girl.. mother took extreme step
Author
Mumbai, First Published Dec 3, 2021, 5:29 PM IST

ముంబయి: కనబోయే బిడ్డ లింగాన్ని ముందుగానే నిశ్చయించుకోలేం. అందులో ఆడవారి ప్రమేయమూ ఉండదు. నిజానికి పుట్టబోయే బిడ్డ లింగాని(Sex)కి సంబంధించి నిర్ణయాత్మకంగా ఉండేది పురుషుడే. కానీ, తరుచూ బిడ్డ లింగానికి సంబంధించిన వేధింపుల(Harassment)కు ఆడవారే గురవుతుంటారు. Maharashtraలో బిడ్డ లింగానికి సంబంధించి ఓ ఘోర ఘటన జరిగింది. ఇది వరకే ఆడపిల్ల ఉన్నదని, మళ్లీ కచ్చితంగా మగ బిడ్డనే కనాలనే షరతు విధించారు. అది సాధ్యం కాకపోవడంతో ఇంటి నుంచే ఆమెను బహిష్కరించారు. తరుచూ అత్తింటివారి వేధింపులు భరించలేక ఆ తల్లి కన్న బిడ్డనే నీళ్ల ట్యాంకులో ముంచి చంపేసింది. సెంట్రల్ ముంబయి కాలాచౌకీ ఏరియాలో ఈ ఘటన జరిగింది.

36ఏళ్ల సపనా బజ్రంగ్ మగ్దుమ్ కాలాచౌకీ ఏరియాకు చెందిన ఓ వ్యక్తిని 2011లో వివాహం చేసుకుంది. వారిద్దరికి ఎనిమిదేళ్ల ఆడ పిల్ల 2013లో జన్మించింది. కాబట్టి, తర్వాతి కాన్పులో కచ్చితంగా మగ బిడ్డకే జన్మ ఇవ్వాలని ఆమెను అత్తింటివారు ఒత్తిడి తెచ్చారు. ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండోసారి గర్భం దాల్చగానే అత్తింటివారు బానామతి చేసి గర్భంలోని బిడ్డ లింగాన్ని ఖరారు(నిజానికి సాధ్యం కాదు) చేసేవారని, బలవంతంగా పిండవిచ్ఛేదనం చేసేవారని పోలీసులు తెలిపారు. ఇదే పద్ధతిలో మరో మూడు సార్లు కూడా బలవంతంగా ఆమెకు అబార్షన్ చేయించారు.

Also Read: హైదరాబాద్: పోర్న్ వీడియోలకు బానిసై మహిళలకు వీడియో కాల్... దినసరి కూలీ అరెస్ట్

మరోసారి గర్భం దాల్చిన సపనా బజ్రంగ్ మగ్దుమ్ ఆగస్టులో ప్రసవించిది. అయితే, రెండో సారి కూడా ఆడ పిల్లకు జన్మనివ్వడంతో భర్త కుటుంబం ఆగ్రహించింది. ఆమెను ఇంటి నుంచి బహిష్కరించారు. అనంతరం, ఆమెతో ఆమె తల్లిదండ్రులు ఉంటున్నారు. తరుచూ అత్తింటివారి వేధింపులు తాళలేక ఆమె తన బిడ్డను చంపేయాలని నిర్ణయించుకుంది. మంగళవారం తన భర్త పనికి వెళ్లగానే ఆమె బిడ్డను ఇంటిలోపల ఉన్న నీళ్ల ట్యాంకులో ముంచేసింది. నీళ్ల ట్యాంకులో ముంచి పై నుంచి మూత పెట్టేసింది. ఆ తర్వాత తన బిడ్డను కిడ్నాప్ చేశారనే ఓ కట్టుకథను ఆమె చెప్పింది.

ఇంటింటా తిరిగి వ్యాపారం చేసే ఓ వ్యక్తి తన బిడ్డను కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. వస్త్రాలకు బకెట్లు అమ్ముతామని చెప్పిన ఆ వ్యాపారస్తుడు తనతోపాటు ఇంటిలోకి వచ్చాడని, ఓ వస్త్రంలో మత్తమందుతో తన ముఖానికి పెట్టాడని ఆరోపించింది. దీంతో ఆమె స్పృహ కోల్పోయిందని, ఆ తర్వాత తన బిడ్డను ఎత్తుకెళ్లాడని తెలిపింది. ఆమె వివరాల మేరకు ఆ వ్యాపారి ఊహా చిత్రాన్ని పోలీసులు సిద్ధం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీని పెట్టారు.

అయితే, దర్యాప్తు జరుగుతుండగానే ఆమె నిజాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు. తానే తన బిడ్డను చంపేశారని ఒప్పుకుంది. ఇంటిలోని వాటర్ ట్యాంకులో ముంచి చంపేశానని వివరించింది. ఆమె చెప్పిన కట్టుకథలో అనేక తప్పిదాలు ఉండటంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది చివరకు ఆమెను తప్పును అంగీకరించింది. పోలీసులు ఆ బాలిక డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు. మహారాష్ట్ర పోలీసులు ఆ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios