Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్: పోర్న్ వీడియోలకు బానిసై మహిళలకు వీడియో కాల్... దినసరి కూలీ అరెస్ట్

అపరిచిత మహిళలకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్న నల్గొండ జిల్లా యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. 

hyderabad Police Arrested young Boy For Making Video calls to unknown womens
Author
Hyderabad, First Published Dec 1, 2021, 12:27 PM IST

హైదరాబాద్: అతడో దినసరి కూలీ. రోజూ కూలీపనులు చేస్తేగానీ పూటగడవదు. అలాంటిది చేతిలో స్మార్ట్ ఫోన్ వుందికదా అని అపరిచిత మహిళలకు వీడియో కాల్ చేసి వేధిస్తూ చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా పానగల్ కు చెందిన గట్టాడి దీపక్ దినసరి కూలీ. వ్యవసాయ పనులకు వెళుతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలోనే తన స్మార్ట్ ఫోన్లో నిత్యం అశ్లీల వీడియోలు చూస్తూ వాటికి బానిసయ్యాడు. ఇలా porn videos కు బానిసవడమే కాదు అపరిచిత మహిళలకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడు.

 తనకు ఇష్టంవచ్చిన ఫోన్ నెంబర్ కు కాల్ చేసేవాడు దీపక్. అవతలివైపు మగవారు ఫోన్ ఎత్తితే వెంటనే కాల్ కట్ చేసేవాడు. ఒకవేళ మహిళలు ఫోన్ ఎత్తితే మాటలు కలిపేందుకు ప్రయత్నించేవాడు. అంతేకాదు ఆ ఫోన్ నెంబర్లకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ చాలా అసభ్యంగా వ్యవహరించేవాడు. 

read more  తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని.. భార్యను ఉరేసి చంపి.. ఫ్యాన్ కు వేలాడదీసిన భర్త..

ఇప్పటికే చాలామంది మహిళలకు ఇలాగే వీడియో కాల్ చేసి వేధించిన దీపక్ తాజాగా హైదరాబాద్ కు చెందిన వేధించసాగాడు. గత ఏప్రిల్ నుండి పలుమార్లు తనకు వీడియో కాల్స్ రావడంతో విసిగెత్తిపోయిన సదరు మహిళ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతికత సాయంతో దీపక్ మహిళలపై వేధింపులకు దిగుతున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరింత మహిళలను కూడా వేధించినట్లు తేలింది. అశ్లీల వీడియోలకు బానిసైన అతడు ఇలా అపరిచిత మహిళలను వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు దీపక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు.

read more  ప్రియుడితో నగ్న వీడియో కాల్స్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త...కూతురుతో కూడా..

ఇక ఉత్తరప్రదేశ్ లో ఇంతకంటే దారుణం వెలుగుచూసింది.  ఘజియాబాద్ కు చెందిన ఓ వివాహిత ప్రియుడితో నగ్నంగా వీడియో కాల్ చేయడమే కాదు కన్నకూతురి నగ్న వీడియోలను కూడా పంపించింది. భార్యపై అనుమానంతో ఇంట్లో రహస్యంగా ఏర్పాటుచేసిన సిసి కెమెరాలో ఇదంతా రికార్డయ్యింది. దీంతో సదరు భర్త సాక్ష్యాధారాలతో సహా పోలీస్ స్టేషన్ కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేసాడు. 

ఢిల్లీలో ఉండే ప్రియుడి కోసం తన భార్య nude video call కూడా రికార్డు చేసిందని బాధిత భర్త ఆరోపించాడు. అలాగే తన కుమార్తె నగ్న వీడియోను కూడా రికార్డు చేసిందని కవిసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వీటికి సంబంధించిన ఫుటేజీని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఇలా విరివిగా స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడా. ఈ స్టార్ట్ ఫోన్స్ జమానాలో టెక్నాలజీ అరచేతిలోకి రావడం ఉపయోగమయితే అశ్లీలత పెరిగి అమ్మాయిలు, యువతులపై వేధింపులు ప్రమాదకరంగా మారాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios