Asianet News TeluguAsianet News Telugu

భర్త ముందే భార్యపై గ్యాంగ్ రేప్.. అత్తవారిపై అలిగి నడుచుకుంటూ వెళ్లిపోతుండగా ఘటన.. ఆరుగురి అరెస్టు

జార్ఖండ్‌లో భర్త ముందే భార్యను గ్యాంగ్ రేప్ చేశారు. భర్త ఇంట్లో గొడవ జరిగిన తర్వాత ఆగ్రహంతో ఆమె పుట్టింటికి బయల్దేరింది. భర్త బైక్ పై వెళ్లి ఆమెను కనుక్కున్నాడు. బుజ్జగించి ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగా ఆరుగురు దుండగులు బైక్‌లపై వచ్చి భర్తను తీవ్రంగా కొట్టారు. ఆమెను భర్త చూస్తుండగానే రేప్ చేశారు.

in front of husband wife gang raped in jharkhand
Author
First Published Sep 26, 2022, 6:12 PM IST

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఓ భర్త ముందే భార్యను దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. అత్తవారింట్లో గొడవ పడ్డ తర్వాత ఆగ్రహంతో అలిగి పుట్టినింటికి వెళ్లాలని ఆ వివాహిత నడుచుకుంటూనే బయల్దేరింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో హైవే పై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. ఆమెను బుజ్జగించి ఇంటికి తీసుకురావడానికి భర్త బైక్ పై వెళ్లాడు. ఆమెన బుజ్జగిస్తుండగానే ఆరుగురు దుండగులు అక్కడికి చేరుకుని భర్తను, భర్తతో తోడుగా వచ్చిన మరో బంధువును చితకబాదారు. ఆ తర్వాత భర్త చూస్తుండగానే భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్త.. వారి వద్దకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారు ఆమెను బైక్ పై మరో చోటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఎదురుగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది.

ఈ దుర్ఘటన పాలము జిల్లాలో చోటుచేసుకుంది. సాత్‌బర్వా పోలీసు స్టేషన్ పరిధిలోని బకోరియా భాలువాహి వ్యాలీ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

పాలము జిల్లా పటాన్ పోలీసు స్టేషన్ పరిధిలో 22 ఏళ్ల మహిళ.. భర్త కుటుంబంతో కలిసి నివసిస్తున్నది. కానీ, అత్తవారితో ఆమెకు గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత ఆమె ఆగ్రహంతో తల్లి వారి ఇంటికి బయల్దేరింది. శనివారం రోజున పొరుగు జిల్లా లతేహర్‌లోని పుట్టింటికి ఆమె కాలి నడకనే బయల్దేరారు.

ఈ క్రమంలో ఆమె సాత్‌బర్వా పోలీసు స్టేషన్ పరిధిలో 39వ జాతీయ రహదారి పై నడుచుకుంటూ వెళ్లారు. ఆమె భర్త మరో బంధువును బైక్ పై తీసుకుని భార్యను వెతకడానికి బయల్దేరాడు. భర్త తన భార్యను చూశాడు. ఆమె వద్దకు వెళ్లి భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఆమెను బుజ్జగించాడు. అదే సమయంలో ఆరుగురు దుండగులు బైక్ పై అక్కడికి వచ్చారు. భర్తను, భర్త బంధువును తీవ్రంగా కొట్టారు. బంధువు స్పృహ కోల్పోయి పడిపోయాడు. భర్త మాత్రం గాయాలతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ మహిళను సమీపంలోనే కొంత దూరానికి తీసుకెళ్లారు. తన భర్త ఆమెను చూడగలుగుతున్నాడు. వినగలుగుతున్నాడు కూడా. ఆ దూరంలో మహిళపై వారు గ్యాంగ్ రేప్ చేశారు.

భర్త ఎలాగోలా సత్తువ కూడదీసుకుని ఆ క్రైమ్ పాయింట్ వరకు వెళ్లగలిగాడు. దీంతో ఆయన భార్యను బైక్ పై ఎక్కించుకుని మరో చోటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. మహిళ సహాయం కోసం అరుస్తూనే ఉన్నది. ఆమె ఏడుపులు విన్న స్థానిక గ్రామస్తులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆమెను కాపాడారు. దుండగుల్లో ఇద్దరిని గ్రామస్తులు పట్టుకున్నారు. మరో నలుగురు తప్పించుకుపోయారు.

మహిళను మేదినీనగర్‌లోని మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చేర్చారు. క్రిటికల్ కండీషన్‌లో ఆమె హాస్పిటల్‌కు వచ్చారు. అయితే, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సాత్‌బర్వా పోలీసు స్టేషన్ ఇంచార్జీ రిషికేశ్ కుమార్ రాయ్ వివరించారు. ఆరుగురు దుండగుల్లో ఇద్దరు తెలుసు అని భర్త తెలిపారు. 

ఈ కేసులోని ఆరుగురిలో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేయగా.. సోమవారం మిగిలిన నలుగురినీ అరెస్టు చేసినట్టు ఎస్పీ చందన్ కుమార్ సిన్హా చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios