2024లో బీజేపీ అధికారంలో నుంచి గద్దె దించడానికి ప్రతిపక్షాలు అన్నీ ఏకం అవుతాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆ పార్టీ అహకారాన్ని ప్రజలు తొలగిస్తారని చెప్పారు. 

ప్రజల ఆగ్రహం వ‌ల్ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ అహంకారానికి గండి ప‌డుతుంద‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.2024 లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీని అధికారంలో నుంచి తొల‌గించ‌డానికి తాను, పొరుగున ఉన్న బీహార్, జార్ఖండ్‌లోని తన సహచరులు అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలుపుతారని చెప్పారు. గురువారం కోల్‌కతాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆమె ప్ర‌సంగించారు. 

Onam 2022: ఘ‌నంగా ఓనం సంబురాలు.. ప్ర‌జ‌ల‌కు గ్రీటింగ్స్ చెప్పిన‌ రాష్ట్రప‌తి, ప్ర‌ధాని

“నేను, నితీష్ కుమార్, హేమంత్ సోరెన్ ఇంకా చాలా మంది 2024లో కలిసి వస్తాం. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ చేతులు కలుపుతాయి. మనమంతా ఒకవైపు, బీజేపీ మరోవైపు ఉంటుంది. బీజేపీకి 300 సీట్ల అహంకారమే శత్రువవుతుంది. 2024లో 'ఖేలా హోబ్' ఉంటుంది” అని మ‌మ‌తా బెన‌ర్జీ చెప్పారు. 

Scroll to load tweet…

ఇటీవల బెంగాల్ పోలీసులు నగదుతో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం పొరుగు రాష్ట్రంలో గుర్రపు వ్యాపారాన్ని నిలిపివేసి, హేమంత్ సోరెన్ ప్రభుత్వ పతనాన్ని నిరోధించిందని పేర్కొన్నారు. జూలై 30న పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలోని పంచ్లా వద్ద జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని పోలీసులు నిలిపివేశారు. వారిని అరెస్టు చేశారు. ఆ వాహ‌నంలో దాదాపు రూ. 49 లక్షల నగదు లభించింది. ఆ డబ్బు తమ రాష్ట్రంలో ఆదివాసీ పండుగకు చీరలు కొనేందుకు ఉద్దేశించంద‌ని వారు పోలీసుల‌తో పేర్కొన్నారు.

యాకూబ్ మెమ‌న్ స‌మాధిపై లైటింగ్ ఏర్పాటు.. చెల‌రేగిన రాజ‌కీయ దుమారం.. పోలీసుల విచారణ

ఈ విష‌యంలో ఆమె మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్క‌రికి రూ. 10 కోట్ల చొప్పున చెల్లించాల‌ని, అలాగే మంత్రి పదవిని ఆఫర్ చేస్తూ హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. ‘‘ సీబీఐ, ఈడీతో మమ్మల్ని బెదిరించవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి ట్రిక్కులను ఎంత ఎక్కువగా అనుసరిస్తే వచ్చే ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటమికి మరింత చేరువవుతారు’’ అని ఆమె అన్నారు.

పళనిస్వామిని రీ ఎంట్రీ.. అన్నాడీఎంకే తాత్కాలిక బాస్‌గా పార్టీ ప‌గ్గాలు

సీనియర్ నేతలు పార్థ ఛటర్జీ, అనుబ్రత మోండల్‌లను వేర్వేరు కేసుల్లో కేంద్ర ఏజెన్సీలు అరెస్టు చేసిన తర్వాత తనపై, తన పార్టీ నేతలపై దురుద్దేశపూరిత ప్రచారానికి తెరలేపినందుకు ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా బీజేపీని, మీడియాలోని ఒక వర్గాన్ని ఆమె తప్పుబట్టారు. వారిపై తీవ్రంగా విమర్శలు చేశారు.