మాండ్యా: ప్రియునితో సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఆమెను, ఆమె ప్రియుడ్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ సంఘటన మాండ్యా తాలూకాలోని రాజేనదొడ్డి గ్రామంలో జరిగింది. హతుడిని టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న రంగస్వామిగా గుర్తించారు. ఈ హత్య కేసును మూడోళ్ల తర్వాత మద్దూరు పోలీసులు ఛేదించారు. 

చామనగర జిల్లాలోని కొల్లేగాల తాలూకాలో గల పూజారి బావిదొడ్డి గ్రామానికి చెందిన రంగస్వామి కొన్నేళ్లుగా మద్దూరు తాలూకాలోని తొప్పనహళ్లి భిమనచెరువు వద్ద రాళ్ల క్యారీలో టిప్పర్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి భీమనకెరె గ్రామానికి చెందిన రూపా అనే యువతితో పెళ్లి జరిగింది.

Also Read: ప్రియుడితో రాసలీలలు: భర్తను చంపిన భార్య, పోలీసులకు ఇలా చిక్కింది

రాజెనగౌడ దొడ్డి గ్రామంలో నివాసం ఉంటున్న వీరికి ముగ్గురు పిల్లలు కలిగారు. ముద్దెగౌడ అనే వ్యక్తి కూడా రంగస్వామితో పాటు కలిసి టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రూపాతో ముద్దెగౌడకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది రంగస్వామికి తెలిసి మందలించాడు. 

దాంతో భర్తను మట్టుబెట్టాలని రూపా నిర్ణయించుకుంది. 2017 జులై 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో పడుకుని ఉన్న రంగస్వామిని రూపా, ముద్దెగౌడ కలిసి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని చందహళ్లి దొడ్డి చెరువు వద్దకు తీసుకుని వెళ్లి మట్టి కోసం తవ్విన గుంతలో పడేసి మట్టితో కప్పేశారు. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ రూపా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Also Read: నైలాన్ తాడుతో గొంతు బిగించి భర్తను చంపిన భార్య

Also Read: రివర్స్: మద్యం తాగొద్దన్నాడని భర్తను చంపిన భార్య..

అయితే, రూపాపై, ఆమె ప్రియుడిపై రంగస్వామి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. మంగళవారం ఉదయం రూపా, ముద్దెగౌడలను తీసుకుని వెళ్లి రంగస్వామి శవాన్ని వెలికి తీశారు. శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం అస్పత్రికి తరలించారు. 

భర్తను హత్య చేసిన విషయం బయటకు రాకుండా ఉండడానికి రూపా మద్దూరులో ఏఎస్ఐ సిద్ధరాజుతో స్నేహం పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం జిల్లా ఎస్పీకి తెలిసింది. సిద్ధరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఎస్పీ ఆదేశించారు. కేసు లేకుండా చేస్తానని సిద్ధరాజు తనను శారీరకంగా వాడుకున్నట్లు రూపా చెప్పింది.