Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కే నా మద్దతు - కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్

ఢిల్లీలో గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, పోస్టింగ్ కోసం అథారిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం మే 19వ తేదీన తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ మద్దతు తెలిపారు. విజిలెన్స్ విభాగంపై పట్టు సాధించకపోతే జైలుకు వెళ్తానని కేజ్రీవాల్ భయపడుతున్నారని ఆయన విమర్శించారు. 

I support the ordinance brought by the Center against the Delhi government - Congress leader Sandeep Dixit..ISR
Author
First Published May 31, 2023, 2:50 PM IST

దేశ రాజధానిలో సేవల నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు తాను మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తెలిపారు. విజిలెన్స్ విభాగంపై పట్టు సాధించకపోతే కనీసం 8-10 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని అరవింద్ కేజ్రీవాల్ కు తెలుసని, అందుకే ఆ ఆర్డినెన్స్ బిల్లుగా మారకుండా చూసేందుకు విపక్షాల మద్దతు కోరుతున్నాని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు.

ప్రధాని మోడీ దేవుడితో కూర్చుంటే.. విశ్వం ఎలా పనిచేస్తుందో ఆయనకే వివరిస్తారు - రాహుల్ గాంధీ

‘‘ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను నేను సమర్థిస్తున్నాను. అంతకు ముందు కేంద్ర నిర్ణయాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అందులో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని పేర్కొంది. అయితే కేంద్రం ఏం చేసినా చట్టం ప్రకారం చేయాలని చెప్పింది. అందుకే కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది’’ అని అన్నారు. ఛత్తీస్ గడ్, రాజస్థాన్ ల పరిస్థితి వేరని, అవి పూర్తి రాష్ట్ర స్థాయి హోదాను కలిగి ఉన్నాయని అన్నారు. కానీ ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతం కూడా అని తెలిపారు. కాబట్టి కేంద్రానికి కూడా అక్కడ అధికారాలు ఉంటాయని అన్నారు. 

కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనేక మంది విపక్ష నాయకులను కలుస్తున్నారని సందీప్ దీక్షిత్ తెలిపారు. వారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. కానీ అందులో ఎక్కువ మందికి కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి రాజ్యాంగం కేంద్రానికి కల్పించిన అధికారాలపై అవగాహన లేదని అన్నారు. ఢిల్లీ సీఎం ఎందుకు భయపడుతున్నారని సందీప్ దీక్షిత్ ప్రశ్నించారు. ఢిల్లీ విజిలెన్స్ డిపార్ట్ మెంట్ పై అధికారాలు పొందకపోతే చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉందని ఆయనకు అర్థమైందని అన్నారు. విజిలెన్స్ డిపార్ట్ మెంట్ వల్ల కేజ్రీవాల్ జైలుకు వెళ్లే పరిస్థితి తలెత్తుతుందని, అందుకే ఆయన ప్రతిపక్షాల మద్దతు కోరుతున్నారని అన్నారు.

ఆ ఇంటర్ స్టూడెంట్ లైంగిక వేధింపులకు గురైంది.. బలరామపురం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి..

కాగా.. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ కొంత కాలంగా విపక్ష నాయకులను కలుస్తున్నారు. ఆయనకు ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, శివసేన (యుబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మద్దతు ప్రకటించారు. జూన్ 1, జూన్ 2 న తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులైన ఎంకె స్టాలిన్, హేమంత్ సోరెన్ లను కలవనున్నారు. అలాగే ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కోరేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీలను ఆప్ జాతీయ కన్వీనర్ సమయం కోరారు.

వార్నీ.. 10 రూపాయిల పందెంలో గెలిచేందుకు రద్దీ రోడ్డుపై స్నానం.. పోలీసులు ఏం చేశారంటే ? వీడియో వైరల్ 

ఢిల్లీలో గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, పోస్టింగ్ కోసం అథారిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం మే 19 న ఆర్డినెన్స్ జారీ చేసింది. రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఆర్డినెన్స్ ఆరు నెలల్లోపు చట్టంగా మారాలి. అంటే ఆ ఆర్డినెన్స్ ఆరు నెలల్లోగా లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందాలి. తరువాత రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే చట్టంగా మారుతుంది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను లోక్ సభలో ఆపగలిగే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు. అందుకే విపక్ష పార్టీల మద్దతుతో రాజ్యసభలో ఆ ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios