Asianet News TeluguAsianet News Telugu

వార్నీ.. 10 రూపాయిల పందెంలో గెలిచేందుకు రద్దీ రోడ్డుపై స్నానం.. పోలీసులు ఏం చేశారంటే ? వీడియో వైరల్

పది రూపాయిల పందెం గెలిచేందుకు రద్దీగా ఉండే రోడ్డుపై ఓ యువకుడు స్నానం చేశాడు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడికి జరిమానా విధించారు. 

Varni.. Bathed on a busy road to win a 10 rupee bet.. What did the police do? The video went viral..ISR
Author
First Published May 31, 2023, 10:36 AM IST

పది రూపాయిల పందెంలో గెలిచేందుకు ఆ యువకుడు చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. రద్దీగా ఉన్న రోడ్డుపైకి వెళ్లి అక్కడే స్నానం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ట్రాఫిక్ పోలీసులు గమనించారు. ఆ యువకుడికి రూ.3,500 ఫైన్ వేశారు. ఈ వింత ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ లో మళ్లీ కవిత పేరు.. ఆమె అసలైన పెట్టుబడిదారంటూ ఆరోపణ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలోని పన్నీర్ సెల్వం పార్కు వద్ద రద్దీగా ఉండే ఓ చౌరస్తా ప్రాంతానికి ఎం ఫరూక్ అనే 24 ఏళ్ల యువకుడు ఆదివారం వెళ్లాడు. రూ.10 పందెం గెలిచేందుకు ఆ రద్దీపైనే స్నానం చేశాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుందని కూడా భావించాడు. 

ఆ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ యువకుడు చేసిన వింత పనిని పలువురు గమనించారు. అతడు స్నానం చేస్తుండగానే పలువురు వ్యక్తులు వెళ్లి ‘ఏం చేస్తున్నావు’ అని ప్రశ్నించారు. దానికి ఫరూక్ సమాధానమిస్తూ.. వేసవి తాపం నుంచి రక్షణ పొందేందుకు ఇలా ఓ ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ఈ దృశ్యాలన్నింటినీ అతడు రికార్డు చేయించి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

స్నేహితుడు మరణించాడని అంత్యక్రియలకు వచ్చిన అఘోర.. మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో..

అయితే ఈ వీడియో ఈరోడ్ జిల్లా ఎస్పీ ఫరూక్ కు చేరింది. దీంతో ఆ యువకుడికి జరిమానా విధించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆ యువకుడిని గుర్తించి, అతడికి సోమవారం రూ.3,500 జరిమానా వేశారు. కాగా.. ఈ నెల మొదట్లో కూడా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఓ యువతి, ఓ యువకుడు నడిరోడ్డుపై బైక్ పై స్నానం చేస్తున్నారు. ఆ యువతి ఓ బకెట్ లో నుంచి నీటిని తోడి, అతడిపై పోస్తూ కనిపించింది. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌ లోని రోడ్డు వారిద్దరూ ఇలా ప్రవర్తించారు. 

విషాదం..హైవోల్టేజీ వల్ల పేలిన ఏసీ.. మహిళ మృతి, కుమారుడికి అస్వస్థత..

ఈ వీడియోపై పలువురు మండిపడ్డారు. ‘‘వినోదం పేరుతో ఇలాంటి నాన్సెన్స్ ను అనుమతిస్తారా? రద్దీగా ఉండే ఉల్హాస్ నగర్ సెక్షన్ -17 మెయిన్ సిగ్నల్ పై ఈ ఘటన జరిగింది. బహిరంగంగా మరెవరూ ఇలాంటి పనులూ చేయకుండా సోషల్ మీడియాలో ఉన్న ఈ కంటెంట్ ను తొలగించడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’’ అని ఆ వీడియో కింద పలువురు కామెంట్లు చేశారు. దీనిపై థానే సిటీ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios