Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోడీ దేవుడితో కూర్చుంటే.. విశ్వం ఎలా పనిచేస్తుందో ఆయనకే వివరిస్తారు - రాహుల్ గాంధీ

విశ్వం ఎలా పని చేస్తుందనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దేవుడికే వివరించగలరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అక్కడున్న కొందరు వ్యక్తులు శాస్త్రవేత్తలకే విజ్ఞాన శాస్త్రాన్ని నేర్పించగలరని తెలిపారు. 

If PM Modi sits with God, he will explain how the universe works - Rahul Gandhi..ISR
Author
First Published May 31, 2023, 1:33 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ దేవుడితో కూర్చుంటే విశ్వం ఎలా పనిచేస్తుందో కూడా ఆయనకే వివరిస్తారని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రవాస భారతీయులనుద్దేశించి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. భారత్ లో కొందరు తమకు అన్నీ తెలుసని నమ్ముతున్నారని అన్నారు. దేవుడితో కూడా కూర్చొని పలు విషయాలను వారికే వివరిస్తారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అలాంటి వ్యక్తులకు ఒక ఉదాహరణ అని అన్నారు. 

ఆ ఇంటర్ స్టూడెంట్ లైంగిక వేధింపులకు గురైంది.. బలరామపురం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి..

‘‘మోడీ దేవుడి పక్కన కూర్చుంటే విశ్వం ఎలా పనిచేస్తుందో ఆయన దేవుడికి వివరించడం ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నాను. అప్పుడు దేవుడు కూడా తానేం సృష్టించానో అని అయోమయానికి గురవుతాడు’’ అని తెలిపారు. ‘‘అక్కడ అన్నీ అర్థం చేసుకునే వ్యక్తుల బృందం ఉంది. వారు శాస్త్రజ్ఞులకు విజ్ఞాన శాస్త్రాన్ని, చరిత్రకారులకు చరిత్రను, సైన్యానికి యుద్ధాన్ని వివరించగలరు. ’’ అని అన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుతూ.. తమ పాదయాత్రను ఆపడానికి ప్రభుత్వం చేయగలిగినదంతా చేసిందని అన్నారు. కానీ దాని ప్రభావం మరింత పెరిగిందని అన్నారు. ఏజెన్సీల దుర్వినియోగం కారణంగా రాజకీయంగా వ్యవహరించడం కష్టంగా మారిందని, అందుకే భారత్ జోడో యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

వార్నీ.. 10 రూపాయిల పందెంలో గెలిచేందుకు రద్దీ రోడ్డుపై స్నానం.. పోలీసులు ఏం చేశారంటే ? వీడియో వైరల్

‘‘భారత్ జోడో యాత్ర ప్రేమ, గౌరవం, హాస్య స్ఫూర్తిని నింపింది. చరిత్రను పరిశీలిస్తే గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురుతో సహా ఆధ్యాత్మిక నాయకులందరూ ఒకే విధంగా దేశాన్ని ఏకం చేశారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. భారీ వక్రీకరణ ఉందని చెబుతూ.. వాస్తవానికి దూరంగా ఉన్న రాజకీయ కథనాన్ని ప్రమోట్ చేస్తూ మీడియాలో చూపిస్తున్నది అసలైన భారతదేశం కాదని అన్నారు. ఇలాంటి విషయాలను ప్రమోట్ చేయడం కేవలం మీడియా ప్రయోజనాల కోసమేనని అన్నారు. 

స్నేహితుడు మరణించాడని అంత్యక్రియలకు వచ్చిన అఘోర.. మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో..

అన్ని మతాలు, మతాల ప్రజల పట్ల బంధుత్వం, ఆప్యాయంగా ఉండాలనే విలువలను కాంగ్రెస్ విశ్వసిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ‘మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ అది. మీరు ఆ విలువలతో ఏకీభవించకపోతే మీరు ఇక్కడ ఉండలేరు. కోపం, ద్వేషం, అహంకారాన్ని నమ్మితే మీరు బీజేపీ మీటింగ్ లో కూర్చుంటారని, నేను మన్ కీ బాత్ చేస్తాను ’’ అని రాహుల్ గాంధీ ఎన్ఆర్ఐలతో అన్నారు. కాగా.. మూడు నగరాల అమెరికా పర్యటన కోసం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న కాంగ్రెస్ నేతలు ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios