Asianet News TeluguAsianet News Telugu

ఆ ఇంటర్ స్టూడెంట్ లైంగిక వేధింపులకు గురైంది.. బలరామపురం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి..

కేరళలోని బలరామపురంలో ఉన్న మతపరమైన విద్యా సంస్థలో ఇటీవల 17 ఏళ్ల బాలిక కేసులో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసు దర్యాప్తులో అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. బాలిక ఆరు నెలల కిందట లైంగిక వేధింపులకు గురైందని పోస్టుమార్టం నివేదిక బహిర్గతపర్చింది. 

That inter-student was sexually harassed.. Sensational things came to light in Balaramapuram incident..ISR
Author
First Published May 31, 2023, 12:27 PM IST

ఇటీవల కేరళలోని బలరామపురంలో 17 ఏళ్ల బాలిక అనుమానస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ బాలిక చనిపోక ముందు లైంగిక వేధింపులకు గురైందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన స్నేహితుడిని పోలీసులు గుర్తించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

భారత్ లో రాజకీయ నాయకుడిగా ఉండటం చాలా కష్టం - శాన్ ఫ్రాన్సిస్కోలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

మే 13న ఇడమనకుళిలోని ఖదీజాతుల్ కుబ్రా ఉమెన్స్ అరబిక్ కాలేజీ లైబ్రరీలో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని బీమపల్లికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థినిగా గుర్తించారు. ఆ మతపరమైన పాఠశాలలో చేరడానికి ఆరు నెలల ముందు బాధితురాలు లైంగిక వేధింపులకు గురైనట్లు పోస్టుమార్టం నివేదిక నిర్ధారించింది. అయితే తాము అప్పుడప్పుడు బాలికను తిట్టేవాళ్లమని, కానీ శారీరకంగా గాయపర్చలేదని ధార్మిక కేంద్రం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వార్నీ.. 10 రూపాయిల పందెంలో గెలిచేందుకు రద్దీ రోడ్డుపై స్నానం.. పోలీసులు ఏం చేశారంటే ? వీడియో వైరల్

కాగా.. ప్రియుడితో పరిచయం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ  మతపరమైన పాఠశాలకు పంపించారని పోలీసులు పేర్కొన్నారు. వారు అక్కడ బాలికను మానసికంగా హింసించారని పోలీసులు తెలుసుకున్నారు. పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టులో బాలిక ఆత్మహత్య చేసుకుందని తేలింది. అయితే రిపోర్టులో తప్పులున్నాయని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని ఆమె బంధువులు ఆరోపించారు. బాధితురాలిని కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే బాలిక మృతికి కారణమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

స్నేహితుడు మరణించాడని అంత్యక్రియలకు వచ్చిన అఘోర.. మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో..

ఎస్ఎస్ఎల్సీ (పదో తరగతి) పాసైన తర్వాత బాలిక ప్లస్ వన్, మత విద్య కోసం బలరామపురం సంస్థలో అడ్మిషన్ పొందింది. ఉపవాస సమయంలో నెల రోజుల సెలవుపై ఇంటికి వచ్చిన బాలిక కొన్ని విషయాలపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. అక్కడ పరిస్థితులు ఏం బాగాలేవని, తాను ఆ సంస్థలో చదవలేకపోతున్నాని చెప్పింది. కానీ తల్లిదండ్రులు బాలికకు నచ్చజెప్పి మళ్లీ అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్లిన కొన్ని రోజులకే బాలిక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios