Asianet News TeluguAsianet News Telugu

నాతో వాజ్‌పేయ్ వివాదమిదీ: గోవిందాచార్య

మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌తో అత్యంత నమ్మకంగా ఉన్న గోవిందాచార్యతో విబేధాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విబేధాల కారణంగా  వాజ్‌పేయ్‌పై  గోవిందాచార్య  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

I called vajpayee Face of Bjp : Media Made it Mukhota : Govindacharya
Author
New Delhi, First Published Aug 17, 2018, 11:06 AM IST


న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌తో అత్యంత నమ్మకంగా ఉన్న గోవిందాచార్యతో విబేధాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విబేధాల కారణంగా  వాజ్‌పేయ్‌పై  గోవిందాచార్య  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాజ్‌పేయ్‌ను బీజేపీ ముసుగుగా అభివర్ణించారు. అయితే ఈ విషయమై గోవిందాచార్య వాజ్‌పేయ్‌కు లేఖ రాశారు.దీంతో వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. ఈ వివాదం ముగిసిన తర్వాత  గోవిందాచార్యను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

రాజకీయాల్లో వాజ్‌పేయ్ పాటించిన  కొన్ని ఆదర్శాలే  రాజకీయాల్లో ఆయనను అజాత శత్రువుగా  నిలిపాయని చెప్పారు.  అధికారం కోసం  ఏనాడూ కూడ   ఆయన అర్రులు చాచలేదన్నారు.అధికారం కావాలి  కానీ దాని కోసం ఎవరి ముందు చేయి చాచను , దేనికి కూడ తలవంచను  అని  వాజ్‌పేయ్ అనేవారని గోవిందాచార్య గుర్తు చేసుకొన్నారు.

ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ గా వాజ్‌పేయ్‌ గురించి చెప్పేవారు. పార్టీలకు, సిద్దాంతాలకు అతీతంగా ఆయన అవలంభించిన ఆదర్శాలే ఆయనను అత్యున్నతంగా నిలిపాయి.వాజ్‌పేయ్‌తో గోవిందాచార్య సన్నిహితంగా ఉండేవారు. వ్యక్తిగత, రాజకీయ ఆశయాలు పార్టీకి లోబడి ఉండాలని వాజ్‌పేయ్ నమ్మేవారని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

దేశ, సామాజిక ప్రయోజనాలకు కూడ కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పేవారన్నారు. ఎవరూ కూడ వివాదాస్పద రాజకీయాల్లో మునిగిపోకూడదని భావించేవారని చెప్పారు. దీని ప్రకారమే ఆయన నడుచుకొన్నారని  గోవిందాచార్య ప్రస్తావించారు. 

అయితే వాజ్‌పేయి, గోవిందాచార్యలకు 1997లో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి రిపోర్టుల ప్రకారం జనరల్‌ సెక్రటరీగా పని చేస్తోన్న గోవిందాచార్య ఎల్‌కే అద్వానీయే అసలైన నాయకుడు .. వాజ్‌పేయి కేవలం ముసుగు మాత్రమే అనే ఆరోపణలు చేశారనే వార్తలు వచ్చాయి. ఈ మాటలు తన ప్రధాని హోదాకు భంగం కల్గించేవిగా ఉన్నాయంటూ వాజ్‌పేయి అద్వానీకి లేఖ రాశారు.

 ఆ వివాదం 1997, అక్టోబర్‌ 3 న మొదలై.. అక్టోబర్‌ 30 1997 ముగిసిందని గోవిందాచార్య చెప్పారు. తాను వాజ్‌పేయిని బీజేపీ ముసుగు అన్నానని  నా మాటలను  మీడియా నా మాటలను వక్రీకరించిందన్నారు. 

అయితే ఈవిషయంలో తన తప్పు లేదని  వాజ్‌పేయ్‌కు 17 పేజీల లేఖ రాసినట్టు గోవిందాచార్య గుర్తు చేసుకొన్నారు. అయితే ఈ వివాదం గురించి  వాజ్‌పేయ్ ఎప్పుడూ కూడ  తనతో ప్రస్తావించలేదన్నారు.  

అయితే తాను  లేఖ రాసిన తర్వాత 1998లో  వాజ్‌పేయ్ తనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారని ఆయన  గుర్తు చేసుకొన్నారు. తనను పార్టీ కీలక పదవిలో నియమించినందున వాజ్‌పేయ్‌తో తనకు మధ్య ఉన్న వివాదం ముగిసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వార్తలు చదవండి

 

బీజేపీ ప్రధాన కార్యాలయంలో వాజ్‌పేయ్ పార్థీవ దేహం

ఒక్క ఓటుతో కుప్పకూలిన వాజ్‌పేయ్ సర్కార్

వాజ్ పేయి అభిమాన నేత ఎవరంటే...

పార్లమెంట్‌పై ఉగ్రదాడి: తృటిలో తప్పించుకొన్న వాజ్‌పేయ్, అద్వానీ

కార్గిల్ యుద్దం: పాక్‌కు చుక్కలు చూపించిన వాజ్‌పేయ్

వాజ్‌పేయ్: 24 ఏళ్ల తర్వాత ఫోఖ్రాన్ అణు పరీక్షలతో సత్తా

హిందూత్వ అతివాదుల్లో మితవాది వాజ్ పేయి

 

Follow Us:
Download App:
  • android
  • ios