బీజేపీ ప్రధాన కార్యాలయంలో వాజ్‌పేయ్ పార్థీవ దేహం: నివాళులర్పించిన మోడీ

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 17, Aug 2018, 10:22 AM IST
former PM's body being moved to BJP HQ
Highlights

 మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ పార్థీవ దేహన్ని ఆయన నివాసం నుండి న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. వాజ్‌పేయ్ గురువారం సాయంత్రం ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
 

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ పార్థీవ దేహన్ని ఆయన నివాసం నుండి న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. వాజ్‌పేయ్ గురువారం సాయంత్రం ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

 

 

శుక్రవారం ఉదయం నిర్ణీత సమయానికి కంటే అరగంట పాలు ఆలస్యంగా బీజేపీ ప్రధాన కార్యాలయానికి  మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ మృతదేహాన్ని బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చారు.   

       కుటుంబసభ్యులు, బీజేపీ నేతలు,. పలువురు కేంద్ర మంత్రులు, అభిమానులు వెంటరాగా  వాజ్‌పేయ్  మృతదేహన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో  బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.

 

 

బీజేపీ వ్యవస్థాపకుల్లో వాజ్‌పేయ్  ఒకరు.  బీజేపీ ప్రధాన కార్యాలయంలో  మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాజ్‌పేయ్ భౌతిక కాయాన్ని బీజేపీ కార్యాలయంలోనే సందర్భకుల కోసం ఉంచనున్నారు. 


బీజేపీ ప్రధాన కార్యాలయంలో వాజ్‌పేయ్ పార్థీవదేహం రాగానే ప్రధానమంత్రి మోడీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పలు రాష్ట్రాల బీజేపీ నేతలు, నివాళులర్పించారు.  మధ్యాహ్నం ఒంటిగంటలకు వాజ్‌పేయ్ అంతిమయాత్ర  ప్రారంభం కానుంది. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

 

 

 వాజ్‌పేయ్ కు అత్యంత సన్నిహితుడు, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి  అద్వానీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో వాజ్‌పేయ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు నివాళులర్పించారు.

 

మరోవైపు మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్‌కు నివాళులర్పించేందుకుగాను నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావాలీ ఢిల్లీకి చేరుకొన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వాజ్ పేయ్ మృతదేహనికి నివాళులర్పించారు...ఇదిలా ఉంటే  సినీ నటి, ఎంపీ హేమమాలిని వాజ్‌పేయ్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. 

                      

న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయ్ మృతదేహానికి నివాళులర్పించారు. 

 

                  

 

     

                

 

 

 

ఈ వార్తలు చదవండి

ఒక్క ఓటుతో కుప్పకూలిన వాజ్‌పేయ్ సర్కార్

వాజ్ పేయి అభిమాన నేత ఎవరంటే..

అటల్ జీ పెళ్లెందుకు చేసుకోలేదు...?

వాజ్ పేయి జీవితంలో అత్యంత చేదు ఘటన ఇదే

కార్గిల్ యుద్దం: పాక్‌కు చుక్కలు చూపించిన వాజ్‌పేయ్

loader