Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల హామీలపై సిద్ధరామయ్య కేబినెట్ కీలక నిర్ణయం..

Karnataka: శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఈ ఐదు హామీలను ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్ధరామయ్య కేబినేట్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు  కర్ణాటక కేబినెట్ సమావేశం శుక్రవారం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ 5 హామీలను అమలు చేయనున్నారు.  

Karnataka CM Siddaramaiah Cabinet Meeting krj
Author
First Published Jun 3, 2023, 5:20 AM IST

Karnataka: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ముఖ్యమైన హామీలను నేరవేర్చేందుకు సిద్ధరామయ్య కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుల, మత వివక్ష లేకుండా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఎన్నికల హామీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వీటిపై క్షుణ్ణంగా చర్చించి, ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వ కేబినెట్ సమావేశం శుక్రవారం జరిగింది.

సమావేశానంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మొత్తం ఐదు వాగ్దానాలు (5 హామీలు) ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తామని చెప్పారు. వీటి అమలుపై కేబినెట్‌ సమావేశం నిర్వహించామని అన్నారు. మొత్తం 5 హామీల అమలుపై లోతుగా చర్చించామనీ,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఐదు హామీలను అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
 
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డికె శివకుమార్, తాను హామీ కార్డుపై సంతకం చేసామనీ, తాము ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని, అవి ప్రజలకు చేరేలా హామీ కార్డులు కూడా పంపిణీ చేశామని తెలిపారు.  గృహ జ్యోతి యోజన జూలై 1 నుంచి ప్రారంభమవుతుందని సీఎం చెప్పారు. ఈ పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేయనున్నారు. జూలై వరకు బిల్లు చెల్లించని వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 

ఏ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమవుతుంది?

అన్న భాగ్య పథకం కింద జులై 1 నుంచి ప్రారంభమవుతుందనీ, బీపీఎల్‌ కుటుంబాలు, అంత్యోదయ కార్డుదారులందరికీ 10 కేజీల ఆహార ధాన్యాలు ఉచితంగా అందజేస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కుల, మత వివక్ష లేకుండా ఐదు హామీలను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. శక్తి యోజన జూన్ 1 నుంచి  అమలులోకి వస్తుందనీ, కర్ణాటకలోనీ ఏసీ లగ్జరీ బస్సులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం చెప్పారు.

అంతకుముందు సిద్ధరామయ్య మాట్లాడుతూ..కర్ణాటక స్టేట్ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని, తాము ఇచ్చిన హామీలను అమలు చేయడానికి దాదాపు  రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని, కావున వాటి అమలు ఏ మాత్రం భారం కాబోదని  చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఐదు వాగ్దానాలు ఇవే..  


>> గృహ జ్యోతి యోజన కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 

>> గృహ లక్ష్మి యోజన కింద ప్రతి కుటుంబంలోని యజమానురాలికి నెలవారీ రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం  

>> అన్న భాగ్య యోజన కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబ సభ్యులందరికీ ప్రతి నెలా 10 కిలోల ఉచిత బియ్యం.

>> యువ నిధి యోజన కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లకు నెలకు 3000 రూపాయలు, డిప్లొమా హోల్డర్‌లకు నెలకు రూ.1,500 చొప్పున రెండేళ్లపాటు ఆర్థిక సాయం 

>> శక్తి యోజన కింద ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. 

Follow Us:
Download App:
  • android
  • ios