Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. రూ. 8 వేలు దొంగలించారనే అనుమానంతో కాలేజీ విద్యార్థినుల బట్టలు విప్పించిన హాస్టల్ వార్డెన్..

రూ. 8 వేలు దొంగతనం చేశారనే అనుమానంతో ఓ హాస్టల్ వార్డెన్ ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులను వివస్త్ర చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 

Hostel warden undressed college students on suspicion of stealing Rs 8,000.. Incident in Delhi..ISR
Author
First Published May 4, 2023, 10:14 AM IST

హాస్టల్లో రూ.8 వేలు దొంగిలించారనే అనుమానంతో ఓ వార్డెన్ ఇద్దరు కాలేజీ అమ్మాయిల బట్టలు విప్పించారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఇద్దరు నర్సింగ్ విద్యార్థులపై దొంగతనం నెపం మోపి, వారిని వేధించి, బలవంతంగా బట్టలు విప్పించింది. ఇది మంగళవారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇలాంటి రోజులు చూడటానికేనా మేము పతకాలు గెలిచింది ? - వినేశ్ ఫోగట్.. ఏడుస్తూ మీడియాతో మాట్లాడిన రెజ్లర్..

ఈ దారుణంపై పోలీసులు స్పందించారు. హాస్టల్ వార్డెన్ బ్యాగ్ నుంచి రూ.8 వేలు మాయమయ్యాయని విచారణలో తేలిందని, ఇద్దరు బోర్డర్లు దాన్ని దొంగిలించి ఉంటారని ఆమె అనుమానించిందని పోలీసులు తెలిపారు. వారిద్దరినీ బట్టలు విప్పేలా చేశారని, అయితే ఏమీ దొరకలేదని వారు చెప్పారు. బాధితులు ఇద్దరూ అహల్యా బాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌కి చెందిన వారని చెప్పారు.

వ్యాప్కోస్ మాజీ చీఫ్ రాజిందర్ గుప్తా, కుమారుడు గౌరవ్ ను అరెస్టు చేసిన సీబీఐ.. ఎందుకంటే ?

ఈ ఘటనపై బాధితులు ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ముందుగా అక్కడ ఐపీసీ 354 కింద జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం దానిని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఘటన అనంతరం విద్యార్థినుల బంధువులు హాస్టల్‌కు చేరుకున్నారు. వార్డెన్ పై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

ఘోర రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్‌ అగస్త్య చౌహాన్ మృతి.. 300 కి.మీ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఘటన

మరోవైపు ఈ వ్యవహారంపై విచారణకు కాలేజీ యాజమాన్యం.. ప్రిన్సిపాల్‌, సీనియర్‌ ఉపాధ్యాయులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే వార్డెన్‌ని హాస్టల్‌ నుంచి తొలగించారు. ఈ ఘటనపై పోలీసులు, అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios