ఇలాంటి రోజులు చూడటానికేనా మేము పతకాలు గెలిచింది ? - వినేశ్ ఫోగట్.. ఏడుస్తూ మీడియాతో మాట్లాడిన రెజ్లర్..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో పలువురు రెజర్లపై చేయి చేసుకున్నారు. దీంతో రెజ్లర్లు కంటతడి పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు. 

Did we win medals to see days like this? - Vinesh Phogat.. Wrestler who spoke to the media while crying..ISR

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న రెజర్ల నిరసనలో బుధవారం అర్ధరాత్రి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, రెజర్లకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు పలువురిని చితకబాదారు. దీంతో భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఉద్వేగానికి గురయ్యారు. ఏడుస్తూనే మీడియాతో మాట్లాడారు. ఇలాంటి రోజులు చూడటానికా తాము ఇన్ని పతకాలు గెలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఇద్దరు రెజ్లర్లపై పోలీసు అధికారి దాడి చేశారని, అతడి సహచరులు చూస్తూ మూగ ప్రేక్షకులుగా మారారని ఆమె ఆరోపించారు.

ఎస్ యూవీ, ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి, పలువురికి గాయాలు.. ఎక్కడంటే ?

తాము క్రిమినల్స్ కాదని, అయినా పోలీసులు తమతో ఇలా ప్రవర్తిస్తున్నారని ఫోగట్ ఆరోపించారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసు అధికారులు లేకపోవడంపై ఆమె ప్రశ్నలు సంధించారు. ‘నన్ను పోలీసులు దూషించి, తోసేశారు. మహిళా పోలీసులు ఎక్కడున్నారు’ అని ఆమె అన్నారు. 

ఈ సందర్భంగా ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో నాలుగు పతకాలు సాధించిన భజరంగ్ పూనియా కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నా పతకాలన్నీ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’’ అని తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నామని, వర్షం వల్ల తమ పరుపులు తడిసిపోయాయని, అయితే పోలీసులు అనుమతించలేదని ఆరోపించారు.

ఈ ఘటన జరిగిన అనంతరం పునియా భార్య సంగీత ఫోగట్ కూడా భావోద్వేగంతో మీడియాతో మాట్లాడారు. తనను పోలీసులు చుట్టుముట్టారని ఆరోపించారు. ‘‘ఢిల్లీ పోలీస్ కి గుండగార్ది అబ్ నహీ చలేగీ (ఢిల్లీ పోలీసుల అత్యుత్సాహం ఇక పని చేయదు). మేము దానిని ఇకపై సహించము. గురువారం ఉదయం నిరసన ప్రదేశంలోకి రైతులు, రైతు నాయకులు రావాలని నేను కోరుతున్నాను. ట్రాక్టర్లు లేదా ట్రాలీలు ఏది దొరకినా ఇక్కడకు రండి.’’ అని ఆమె అన్నారు. ఈ సమయంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. 

వ్యాప్కోస్ మాజీ చీఫ్ రాజిందర్ గుప్తా, కుమారుడు గౌరవ్ ను అరెస్టు చేసిన సీబీఐ.. ఎందుకంటే ?

కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అనుమతి లేకుండా మడతపెట్టిన పడకలతో భారతి నిరసన స్థలానికి వచ్చారని పోలీసులు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ‘‘బెడ్ల గురించి అడగ్గానే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి ట్రక్కు నుంచి బెడ్లు తీసుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో భారతితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం’’ అని చెప్పారు.

ఈ ఘటన తర్వాత పోలీసులు జంతర్ మంతర్ ప్రాంతాన్ని మూసివేశారు. అయితే పలువురు ప్రతిపక్ష నాయకులు నిరసనకారులను కలిసేందుకు ప్రయత్నించినా.. వారిని పోలీసులు అనుమతించలేదు. ఇదిలా ఉండగా.. రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపలు ఆరోపణలు చేస్తున్నారు. ఏడుగురు మహిళా రెజ్లర్లపై ఆయన లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని, వెంటనే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన చేపడుతున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్‌ అగస్త్య చౌహాన్ మృతి.. 300 కి.మీ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఘటన

అయితే తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని సింగ్ వాదిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశిస్తే తాను రాజీనామా చేస్తామని అన్నారు. రెజ్లర్ల నిరసనతో ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఆయనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మైనర్ ఫిర్యాదు మేరకు వీరిలో ఒకరిపై కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios