ఘోర రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ అగస్త్య చౌహాన్ మృతి.. 300 కి.మీ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఘటన
ఫేమస్ యూట్యూబర్, బైక్ వ్లాగర్ అగస్త్య చౌహాన్ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ఆగ్రా నుంచి తన రేసింగ్ బైక్‌పై న్యూఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఇది జరిగింది. తన సూపర్ బైక్ పై 300 కిలో మీటర్ల వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
యూట్యూబర్, ప్రొఫెషనల్ బైకర్ అగస్త్య చౌహాన్ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన తన సూపర్‌బైక్‌పై గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అగస్త్య చౌహాన్ వృత్తిరీత్యా బైకర్. అతడు తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో చేస్తూ.. మొదటిసారిగా తన జెడ్ ఎక్స్ 10ఆర్ నింజా సూపర్‌బైక్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని సాధించడానికి ప్రయత్నించాడు.
రెజ్లర్లతో పీటీ ఉష భేటీ.. ‘క్రమశిక్షణా రాహిత్యం’ వ్యాఖ్యలు చేసిన ఆరు రోజుల తరువాత పరిణామం..
అయితే బైక్ వేగంగా దూసుకుపోతున్న సమయంలో అతడు ఒక్క సారిగా తడబడ్డాడు. దీంతో బైక్ అదుపుతప్పింది. బైక్ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై డివైడర్‌ను ఢీకొట్టింది.క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదంలో అతడి హెల్మెట్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో రైడర్ అక్కడికక్కడే మరణించాడు. అతడి శరీరం రక్తం చిమ్ముతూ కదలకుండా ఉండిపోయింది. అగత్స్య తలకు తీవ్ర గాయాలవడంతో ఈ మరణం సంభవించింది.
దారుణం.. ఐదుగురు చిన్నారులను బెదిరించి గ్యాంగ్ రేప్.. దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి..
అగస్త్య చౌహాన్ ఆగ్రా నుంచి తన రేసింగ్ బైక్‌పై న్యూఢిల్లీకి వెళ్తున్నాడు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 47 మైలు వద్ద యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. అతడు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ కు చెందిన వ్యక్తి. అగస్త్య 'PRO RIDER 1000' అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. ఆ ఛానెల్‌కు 1.2 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. చివరి సారిగా అగస్త్య సుమారు 16 గంటల కిందట యూట్యూబ్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశాడు. అందులో న్యూఢిల్లీకి చేరుకోవాలని తన స్నేహితులకు విజ్ఞప్తి చేశాడు.
క్రికెటర్ మహ్మద్ షమీకి వేశ్యలతో వివాహేతర సంబంధాలు - భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు
అగస్త్య తన ఛానెల్ కోసం బైక్ నడపుతూ, వ్లాగింగ్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసేవాడు. ఈ రంగంలో ఆయన ఫేమస్ అయ్యాడు. అగస్త్య తన ఛానెల్‌లో కొత్త వీడియోను అప్‌లోడ్ చేసినప్పుడల్లా వేగంగా వాహనాలు నడపవద్దని ప్రజలకు ఎప్పటికప్పుడు సూచించేవాడు.