Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్ర, గుజరాత్ లలో రూ. 120 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్: ఆరుగురు అరెస్ట్

మహారాష్ట్ర, గుజరాత్ లలో రూ. 120 కోట్ల విలువైన డ్రగ్స్  ను ఎన్సీబీ అధికారులు శుక్రవారం నాడు సీజ్ చేశారు. ఎయిరిండియా మాజీ పైలెట్ సహా ఆరుగురిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 

NCB seizes mephedrone worth nearly Rs 120 cr from Mumbai, Gujarat
Author
First Published Oct 7, 2022, 11:45 AM IST

న్యూఢిల్లీ:  మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుండి రూ.120 కోట్ల  విలువైన డ్రగ్స్ ను ఎన్సీబీ అధికారులు శుక్రవారం నాడు సీజ్ చేశారు. ఆరుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేశారు. ఆరుగురిలో ఎయిరిండియాకు చెందని మాజీ పైలెట్ కూడా ఉన్నారు. 

గుజరత్  లోని ఇంటలిజెన్స్ యూనిట్ ఇచ్చిన నిర్ధిష్ట సమాచారం ఆధారంగా  ఈఆరుగురిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఈ  విషయాన్ని ఎన్సీబీ  డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ చెప్పారు. పక్కా సమాచారం ఆధారంగా ఢిల్లీలోని ఎన్సీబీ ప్రధాన కార్యాలయం  ముంబై జోనల్ యూనిట్ అధికారులు ఈ నెల 3 వతేదీన జామ్ నగర్ లో దాడులు చేశారు. 10కిలోల మెఫిడ్రొన్ ను స్వాధీనం చేసుకున్నారు. జామ్ నగర్ లో ఒకరిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిని ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. గురువారం నాడు ఎన్సీబీ అధికారులు దక్షిణ ముంబైలోని ఫోర్ట్  ప్రాంతంలో ఎస్ బీ రోడ్ లో ఉన్న గోడౌన్ పై దాడిచేసి 50 మెఫిడ్రిన్ ను స్వాదీనం చేసుకున్నారని ఎన్సీబీ అధికారులు తెలిపారు. 

also read:అచ్చు సినిమానే: కడుపులో కొకైన్ తరలిస్తూ ఢిల్లీలో పట్టుబడిన విదేశీయుడు

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు కీలక వ్యక్తులతో పాటు  ఎయిరిండియాలో గతంలో పైలెట్ గా పనిచేసిన సోహైల్ గఫార్  మహీదా ఎయిరిండియా మాజీ పైలెట్ అని ఎన్సీబీ అధికారులు వివరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios