Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. పక్షవాతంతో బాధపడుతున్న భార్య పరిస్థితి చూడలేక దారుణంగా హతమార్చిన భర్త.. ఎక్కడంటే ?

కర్ణాటక రాష్ట్రంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్య అనారోగ్యంతో అవస్థలు పడుతున్న తీరును చూడలేక ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణంగా హత్య చేశాడు. 

Horrible.. The husband who could not see the condition of his paralyzed wife and brutally killed her.. Where is he?
Author
First Published Dec 6, 2022, 12:26 PM IST

పక్షవాతంతో మంచం పట్టిన 50 ఏళ్ల మహిళను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన దక్షిణ బెంగళూరులోని తురహళ్ళిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.  ఉత్తర కర్ణాటకలోని విజయపురకు చెందిన 60 ఏళ్ల శంకరప్ప, 50 ఏళ్ల శివమ్మ భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిగింది.

బెంగళూరులో దారుణం.. అర్థరాత్రి రాళ్లతో తలపగలగొట్టి వ్యక్తి హత్య..

శంకరప్ప వాచ్ మెన్ గా పని చేస్తూ ఉంటాడు. శివమ్మ రెండు సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతోంది. పెళ్లయిన కూతురు తన తల్లిని చూసుకుంటూ, సపర్యలు చేస్తూ ఉండేది. తన భర్తతో కలిసి 80 ఫీట్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ భవనంలో నివసిస్తున్నారు. అయితే భార్య అవస్థను చూడలేక శంకరప్పను హత్య చేయాలని భావించాడు.

ఈ క్రమంలో ఆదివారం  కుమార్తె, అల్లుడు ఉద్యోగాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వీరి కుమారుడు కూడా మధ్యాహ్నం 12.30 గంటలకు సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించి శంకరప్ప తన భార్యను నీటితో నిండిన బిల్డింగ్ సెల్లార్ వైపు తీసుకెళ్లాడు. భార్యను నీటిలో విసిరేసి మొదటి అంతస్తుకు తిరిగి వచ్చాడు.

మోర్బీ ఘటన విషయంలో ప్రధాని మోదీపై విమర్శలు.. జైపూర్‌లో టీఎంసీ అధికార ప్రతినిధి అరెస్ట్..

కొంత సమయం తరువాత కుమారుడు దుకాణం నుంచి తిరిగి వచ్చాడు. తన తండ్రి సెల్లార్ నుంచి రావడం గమనించాడు. తన తల్లి ఎక్కడికి వెళ్లిందని తండ్రిని అడిగాడు. ఆమె ఎక్కడుందో తనకు తెలియదని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ కుమారుడికి తండ్రి తీరుపట్ల అనుమానం వచ్చింది. వెంటనే సెల్లార్ లోకి పరిగెత్తాడు. తన తల్లి నీటిలో నుంచి బయటపడేందుకు కష్టపడటం గమనించాడు.

‘పర్లేదు సార్.. ఉండనివ్వండి...’ క్యాబ్ డ్రైవర్ సహృదయానికి మాజీ ట్విట్టర్ ఎండీ ఫిదా..

వెంటనే సమీపంలోని గ్యారేజీకి పరుగెత్తాడు. తన తల్లిని రక్షించేందుకు అక్కడ ఉన్న స్థానికులను తీసుకువచ్చాడు. దీంతో వారు శివమ్మను ను నీటి నుంచి బయటకు తీశారు. కానీ ఆమె అప్పటికే మరణించింది. ఈ ఘటనపై తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios