ఫారిన్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, గుట్టు రట్టు చేసిన పోలీసులు

Hi-tech sex racket busted in Mangaluru
Highlights

అమెరికా సెక్స్ రాకెట్ గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు మంగుళూరు పోలీసులు.

అమెరికా సెక్స్ రాకెట్ గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు మంగుళూరు పోలీసులు. స్వచ్ఛంద సేవా సంస్థల ముసుగు విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టూరిస్ట్ ప్లేస్ అయిన మైసూర్‌ను కేంద్రంగా చేసుకొని ఈ చీకటి కార్యకలాపాలు చేస్తున్నారు.

ఓదండి సేవా సంస్థ మంగళూరు నగరంలోని ఓ లాడ్జీలో గుట్టుగా సాగిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని మంగళూరు క్రైం పోలీసులు బట్టబయలు చేశారు. బంగ్లాదేశ్, నేపాల్ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు.

మంగళూరు క్రైం విభాగం డీసీపీ ఉమా ప్రశాంత్ బృందం చేసిన జరిపిన ఆకస్మిక తనిఖీలో మొత్తం 11 మంది విటులను అరెస్టు చేసి ఆరుగురు అమ్మాయిలను ఈ చీకటి చెర నుంచి విడిపించారు. ఈ హైటెక్ సెక్స్ రాకెట్‌లో ఓదండి సేవా సంస్థ డైరెక్టర్లు కేవీ స్టాన్లీ, ఎమ్ఎల్ పరశురాంలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

loader