Asianet News TeluguAsianet News Telugu

ముంబయి విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం.. రూ.70కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

ముంబయి కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి దాదాపు పది కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.70కోట్ల ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 

Heroin Worth 70 Crore Seized At Mumbai Airport, Two Arrested
Author
First Published Mar 21, 2023, 12:55 AM IST

ఇటీవలి కాలంలో స్మగ్లర్లు ఎలా రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిషేధిత డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా చేయడానికి రోజుకో పద్దతిలో ప్రయత్నిస్తునే ఉంటున్నారు.అయితే.. భద్రతా సిబ్బంది అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజానికి పోలీసులకు,కస్టమ్స్ అధికారులకు పెద్ద సవాలు గానే మారి పోయింది అని చెప్పాలి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. కస్టమ్స్ అధికారులు అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తున్నారు. 

తాజాగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోట్ల విలువైన హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) స్వాధీనం చేసుకుంది. ముంబై విమానాశ్రయంలో అడిస్‌ అబాబా నుంచి ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి రూ.70 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ తెలిపింది. ఆ ప్రయాణికుడి బ్యాగ్‌ని సోదా చేయగా అందులో 9.97 కిలోల డ్రగ్స్‌ లభించాయి.  అతడిని డీఆర్‌ఐ అరెస్ట్ చేసింది. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.70 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మేరకు సోమవారం ఓ అధికారి వెల్లడించారు.

 బ్యాగులో 70 కోట్ల హెరాయిన్ లభ్యం

అడిస్ అబాబా నుండి ముంబైకి వస్తున్న ప్రయాణీకుడు భారతదేశంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాన్ని DRI, MZU అధికారుల బృందం పర్యవేక్షించింది. అనుమానిత ప్రయాణికుడిని మార్చి 19 ఉదయం DRI అధికారుల బృందం అడ్డగించింది. ప్రయాణీకుడి సామాను పూర్తిగా శోధించింది. ఈ క్రమంలో సదరు ప్రయాణికుడు తీసుకెళ్లిన బ్యాగేజీలో 9.97 కిలోల హెరాయిన్‌ను బయటపడింది. ఈ డ్రగ్ అంతర్జాతీయ మార్కెట్ విలువ దాదాపు రూ.70 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 

ప్రాథమిక విచారణలో ముంబైలోని ఓ హోటల్‌లో  పని చేసే వ్యక్తికి తాను చెప్పిన ట్రాలీ బ్యాగ్‌ను అందజేయవలసి ఉందని ప్రయాణీకుడు వెల్లడించాడు. దీని ప్రకారం డ్రగ్స్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు ఉచ్చు బిగించారు. డెలివరీ తీసుకునేందుకు హోటల్‌కు వచ్చిన నైజీరియన్ జాతీయుడిని అధికారులు పట్టుకోగలిగారు. అనంతరం నైజీరియా దేశస్థుడి నివాసంలో సోదాలు నిర్వహించి..కొద్ది మొత్తంలో కొకైన్, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ స్మగ్లింగ్‌కు కారణమైన అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లో సభ్యుడైన నైజీరియా దేశస్థుడైన ప్రయాణికుడిని అరెస్టు చేసి DRI కస్టడీకి పంపారు. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది. అధికారులు తర్వాత నైజీరియా దేశస్థుడి ఇంటిలో సోదాలు చేశారు, అతను కొకైన్ మరియు హెరాయిన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఇద్దరిపైనా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేసి డిఆర్‌ఐ కస్టడీకి పంపారు.

Follow Us:
Download App:
  • android
  • ios