Asianet News TeluguAsianet News Telugu

విషమంగానే వాజ్‌పేయ్ ఆరోగ్యం: ఇంటి వద్ద భారీ బందోబస్తు

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్  ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  వాజ్‌పేయ్ మరింత క్షీణించిందని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో  పోలీసులు వాజ్‌పేయ్ నివాసం వద్ద బందోబస్తును పెంచారు.

Heavy security deployed at former PM AtalBihariVajpayee's residence.
Author
New Delhi, First Published Aug 16, 2018, 2:29 PM IST

న్యూఢిల్లీ:మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్  ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  వాజ్‌పేయ్ మరింత క్షీణించిందని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో  పోలీసులు వాజ్‌పేయ్ నివాసం వద్ద బందోబస్తును పెంచారు.

కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో వాజ్‌పేయ్ బాధపడుతున్నారు. దీంతో ఆయన చికిత్స తీసుకొంటున్నారు. ఇటీవల కాలంలో వ్యాధి తీవ్రత మరింత పెరిగింది. దీంతో ఈ నెల 12 వ తేదీన వాజ్‌పేయ్ ను ఎయిమ్స్‌లో చేర్చారు. 

బుధవారం సాయంత్రం వాజ్‌పేయ్ ఆరోగ్యం మరిం క్షీణించిందని వైద్యులు ప్రకటించారు. గురువారం ఉదయానికి పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు హెల్త్‌ బులెటిన్‌లో ప్రకటించారు.

వెంటిలేటర్‌పై వాజ్‌పేయ్ కు శ్వాస అందిస్తున్నట్టు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. దీంతో ఎయిమ్స్ వద్ద కూడ వీఐపీల రాక పెరిగింది. మరో వైపు వాజ్‌పేయ్ నివాసానికి కూడ ప్రముఖులు క్యూ కడుతున్నారు.

వాజ్‌పేయ్ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.  ప్రముఖులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో కూడ పోలీసులు భారీగా మోహరించారు. 

ఈ వార్తలు చదవండి

మరింత క్షీణించిన వాజ్‌పేయ్ ఆరోగ్యం: ఎయిమ్స్‌‌కు క్యూ కట్టిన ప్రముఖులు

బ్రతికుండగానే.. వాజ్ పేయి చనిపోయారని ట్వీట్.. వివాదం

మాజీ ప్రధాని వాజ్‌పేయ్ ఆరోగ్యం మరింత విషమం: మోడీ పరామర్శ

 

Follow Us:
Download App:
  • android
  • ios