మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మాజీ కేంద్ర మంత్రి,బీజేపీ సీనియర్ నేత అద్వానీ ఎయిమ్స్ లో వాజ్‌పేయ్‌ను పరామర్శించారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మాజీ కేంద్ర మంత్రి,బీజేపీ సీనియర్ నేత అద్వానీ ఎయిమ్స్ లో వాజ్‌పేయ్‌ను పరామర్శించారు. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి ఎయిమ్స్‌కు రానున్నారు. వాజ్‌పేయ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను వాకబు చేయనున్నారు.
ఎయిమ్స్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్ లోనే ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్ లోనే ఉన్నారు. బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా తమ కార్యక్రమాలను రద్దు చేసుకొన్నారు.
బీజేపీ కీలక నేతలు ఎయిమ్స్ కు చేరుకొంటున్నారు. కొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిమ్స్‌కు చేరుకోనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎయిమ్స్‌కు చేరుకొని వాజ్‌పేయ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.
వాజ్‌పేయ్ బంధువులు హుటాహుటిన గ్వాలియర్ నుండి ఢిల్లీకి బయలుదేరారు. గ్వాలియర్‌లోని ఆయూష్ కాలేజీ విద్యార్థులు వాజ్‌పేయ్ ఆరోగ్యం మెరుగుపడాలని హోమం నిర్వహించారు.
గురువారం నాడు ఉదయం పూట ఎయిమ్స్ వైద్యులు వాజ్‌పేయ్ ఆరోగ్యంపై హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. వాజ్‌పేయ్ ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు.
