మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ ఆరోగ్యం విషమించింది. అనారోగ్యంతో వాజ్‌పేయ్ ను ఈ నెల 12 వేతదీన ఆసుపత్రిలో చేర్చారు. వాజ్‌పేయ్ ను ప్రధానమంత్రి మోడీ బుధవారం సాయంత్రం పరామర్శించారు

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ ఆరోగ్యం విషమించింది. అనారోగ్యంతో వాజ్‌పేయ్ ను ఈ నెల 12 వేతదీన ఆసుపత్రిలో చేర్చారు. వాజ్‌పేయ్ ను ప్రధానమంత్రి మోడీ బుధవారం సాయంత్రం పరామర్శించారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు చెబుతున్నారు. కొంతకాలంగా వాజ్‌పేయ్ ఆరోగ్యం క్షీణిస్తోంది. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అయితే బుధవారం నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో ఎయిమ్స్ లో వాజ్ పేయ్ ను పలువురు ప్రముఖులు పరామర్శించారు.

బుధవారం నాడు సాయంత్రం వాజ్ పేయ్ ను ఎయిమ్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. గురువారం నాడు ఏపీలో జరగాల్సిన బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని రద్దు చేసుకొన్నారు.

Scroll to load tweet…

మూత్రపిండాల వ్యాధితో వాజ్ పేయ్ బాధపడుతున్నారు. దీనికితోడు ఆయన ఆరోగ్యం క్షీణించింది. వాజ్‌పేయ్ ఆరోగ్యం క్షీణించడంతో బీజేపీ నేతలు ఎయిమ్స్ కు చేరుకొంటున్నారు. వాజ్ పేయ్ ను పరామర్శిస్తున్నారు.