దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 

దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప‌లు ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ను శుక్ర‌వారం ఉద‌యం మేఘాలు ముంచెత్తాయి. ఉద‌యం పూట చ‌ల్ల‌గాలులు వీచాయి. తేలిక‌పాటి వ‌ర్షం కురిసింది. అయితే మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఢిల్లీలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 

ఇదిలావుండగా శుక్రవారం నుంచి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ హెచ్చ‌రించింది. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు తీవ్రమైన వర్షపాతం నమోదవుతుంద‌ని ఐఎండీ తెలిపింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కానీ ఉత్తరాఖండ్ తూర్పు అర్ధభాగానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

పార్టీని సంస్కరించాలి.. మేనిఫెస్టో విడుదల చేసిన శశి థ‌రూర్

వాతావరణ శాఖ జారీ చేసిన భారీ వ‌ర్షం హెచ్చ‌రిక‌ను అనుస‌రించి తెహ్రీ జిల్లాలో 1 నుండి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలను ఒక రోజు పాటు మూసివేయాలని యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. 

ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ద్రౌపది కా దండ -II శిఖరాన్ని హిమపాతం ఢీకొనడంతో 19 మంది మరణించారు. ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ కు చెందిన పర్వతారోహకుల బృందం శిఖరం నుండి తిరిగి వస్తుండగా హిమపాతంలో చిక్కుకోవ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ బృందం మంగళవారం ద్రౌపది కా దండ II శిఖరాన్ని అధిరోహించి తిరిగి వస్తుండగా 17,000 అడుగుల ఎత్తులో హిమపాతం సంభవించింది.

"మీరు తిట్టినంతంగా నన్ను మా భార్య‌ కూడా తిట్టదు".. లెఫ్టినెంట్ గవర్నర్ పై కేజ్రీవాల్ సెటైర్

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు పట్టణంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. మరో ఐదు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

అలాగే హైదరాబాద్‌లో గురువారం రాత్రి ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల పాటు ఒకటి రెండు సార్లు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

చారిత్రాత్మక మదర్సాలోకి బలవంతంగా చొర‌బాటు..

ఇదిలా ఉండ‌గా.. రాబోయే 2-3 రోజుల్లో ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో శుక్రవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.