Asianet News TeluguAsianet News Telugu

"మీరు తిట్టినంతంగా నన్ను మా భార్య‌ కూడా తిట్టదు".. లెఫ్టినెంట్ గవర్నర్ పై కేజ్రీవాల్ సెటైర్ 

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తనకు రాసిన లేఖ పట్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత ఆరు నెల‌ల్లో లెఫ్టినెంట్ గవర్నర్ తనకు రాసిన‌న్ని అన్ని ప్రేమలేఖలు తన భార్య కూడా రాసి ఉండదని చమత్కరించారు. 

Delhi CM Arvind Kejriwal asks V K Saxena to chill a bit
Author
First Published Oct 7, 2022, 5:41 AM IST

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌జీ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వం మధ్య ర‌గ‌డ జ‌రుగుతోంది. ఎక్సైజ్ కుంభకోణం, డిటిసి బస్సు కుంభకోణం, ఉచిత విద్యుత్ పథకంపై విచారణకు ఆదేశించారు. ఈ త‌రుణంలో ఇరువురు ఒక‌రిపై ఒక‌రూ విమ‌ర్శాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తనకు రాసిన లేఖ పట్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత ఆరు నెలల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి తనకు ఎన్నో 'ప్రేమలేఖలు' అందాయని చమత్కరించారు. 
 
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని టార్గెట్ చేస్తూ గురువారం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. "ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సాహిబ్ నన్ను ప్ర‌తిరోజూ తిట్టినంతగా, నా భార్య కూడా నన్నుకూడా తిట్టదు. గత ఆరు నెలల్లో ఎల్‌జీ సాహిబ్ నాకు రాసినన్ని ప్రేమ లేఖలు నా భార్య రాయలేదు" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. "ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు.. కొంచెం శాంతించండి.. మీ సూపర్ బాస్ కు చెప్పండి... ఆయనను కూడా కొంచెం శాంతించమనండి" అంటూ కేజ్రీవాల్ సైట‌ర్ వేశారు.    

కేజ్రీవాల్‌కి మనోజ్ తివారీ సమాధానం

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌పై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ   స్పందించారు. మనోజ్ తివారీ ట్వీట్ చేస్తూ.. ఈ చిల్లర భాష సీఎం కేజ్రీవాల్ జీ మానసిక స్థాయి ఏమిటో చెబుతుందని అన్నారు. ఏడేళ్లుగా ఒక్క డిపార్ట్‌మెంట్‌ను స‌రిగా నిర్వహించలేదు, నేటికీ ఒక్క ఫైల్‌పై సంతకం చేయలేదు, మీ ఆసక్తి కేవలం దోపిడి, అబద్ధాల మీద మాత్రమే ఉంది, అది ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుందని విమ‌ర్శ‌లు గుప్పించారు.

 

ఉచిత విద్యుత్ పథకంపై ఎల్‌జీ విచారణ 

తాజాగా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకంపై విచారణకు ఆదేశించింది. ఎల్జీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గుజరాత్ ఎన్నికలతో ముడిపెట్టారు సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఎల్జీ ఈ ఉత్తర్వులు తీసుకున్నారని ఇద్దరూ ఆరోపించారు.

గుజరాత్ ఓడిపోతుందనే భయం బీజేపీకి ప‌ట్టుకుందనీ.. కాబట్టి, ఈ బూటకపు విచారణ జరిపించాలన్నారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ వద్దకు సీఎం కేజ్రీవాల్ రాకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్  సీఎంఓకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. గత మేలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా సక్సేనా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్ కు ఆయనకు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios