కొద్దిరోజుల క్రితం తమిళనాడుకు అపారనష్టాన్ని మిగిల్చిన ‘‘గజ’’ విధ్వంసాన్ని మరచిపోకముందే.. తమిళనాడుకు మరో ముప్పు పొంచి వుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తమిళనాడు, పుదుచ్చేరీలలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడుకు పశ్చిమ దిశలో పయనిస్తోందని ఐఎండీ ప్రకటించింది. దీని కారణంగా కాంచీపురం, కడలూరు, తిరువణ్ణామలై, నాగపట్నం, కరైకల్, అరియాలూర్ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని సమాచారం ఉండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆయా జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఇవాళ జరగాల్సిన పరీక్షలను సైతం వాయిదా వేస్తు్నట్నలు యూనివర్సిటీ ప్రకటించింది. వారం క్రితం బంగాళాఖాతంలో సంభవించిన ‘‘గజ’’ తుఫాను పది జిల్లాల్లో బీభత్సం సృష్టించింది.. దీని ధాటికి 46 మంది ప్రాణాలు కోల్పోగా...భారీ ఆస్తినష్టం సంభవించింది. 
 

గజ తుఫాను బాధితులకు కోలీవుడ్ అండ.. ఎవరెంత ఇచ్చారంటే?

తమిళనాడులో ‘‘ గజ ’’ బీభత్సం... 45 మంది దుర్మరణం

జీఎస్ఎల్వీ మార్క్3-డీ2 ప్రయోగానికి ‘‘గజ’’ ఒప్పుకుంటుందా..?

తీవ్రరూపం దాల్చిన ‘‘గజ’’: కడలూరుకు రెడ్ అలర్ట్

దూసుకొస్తున్న ‘‘గజ’’.. కృష్ణపట్నంలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో ‘‘గజ’’....ఏపీకి పొంచివున్న మరో తుఫాను ముప్పు