గత కొంత కాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్న బీఆర్ఎస్..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలయ్యేంత వరకు రాష్ట్రానికి పరిమితం కావాలని యోచిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. 

గత ఏడాది అక్టోబర్ నుంచి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి, పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ప్రణాళికలతో ముందుకెళ్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకత్వం.. ఇప్పుడు ఆ విషయంలో కొంత నెమ్మదిగా వెళ్లాలని నిర్ణయించింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే కేంద్రీకరించాలని భావిస్తోంది.

విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి, 30 మందికి పైగా అస్వస్థత..

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నప్పటికీ.. దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించిన అఖండ విజయం తెలంగాణలో వ్యూహాల గురించి బీఆర్ఎస్ ను ఆలోచించేలా చేసింది. ‘డెక్కన్ క్రానికల్’ కథనం ప్రకారం.. రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని నిలుపుకోవడంపైనే పార్టీ నాయకత్వం దృష్టి సారించాలని భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

ఫిట్టింగ్ సూట్, సన్ గ్లాసెస్ తో కొత్త లుక్ లో జైశంకర్.. ఫొటో వైరల్.. హాలీవుడ్ స్టార్ లా ఉన్నారంటూ కామెంట్లు

ప్రస్తుతానికి పూర్తిగా మహారాష్ట్రపై దృష్టి సారించి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుండగా, అసంతృప్త బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి ఫిరాయించకుండా నిరోధించాలని, కర్ణాటకలో అద్భుత విజయం తర్వాత తెలంగాణలో దాని ఎదుగుదలను అడ్డుకోవాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలు, ముఖ్యంగా కర్ణాటకతో సరిహద్దులు పంచుకునే అవిభాజ్య రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ లపై దృష్టి సారించాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ జిల్లాల ప్రజలకు కర్ణాటకలో సంబంధాలు ఉన్నాయి. కర్ణాటక ఫలితాలు ఈ జిల్లాల్లో ఓటర్లను ప్రభావితం చేస్తాయని ఆ పార్టీ భావిస్తోంది.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ లో ప్రభుత్వం, పార్టీ యంత్రాంగాన్ని ప్రజాకర్షణ కార్యక్రమాల్లో నిమగ్నం చేయాలని బీఆర్ ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పరంగా గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించడమే దీని ఉద్దేశం. గత తొమ్మిదేళ్ల ప్రోగ్రెస్ కార్డులను సిద్ధం చేయాలని అన్ని శాఖల అధికారులను కోరగా.. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకులు మొదలుకొని గ్రామస్థాయిలో సర్పంచుల వరకు మంత్రులు, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ నివేదికలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మద్దతు కూడగట్టాలని కోరారు.

దారుణం.. భార్యను హతమార్చి, మృతదేహాన్ని బెడ్ బాక్స్ లో దాచిన భర్త.. ఎక్కడంటే ?

బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలపై డాక్యుమెంటరీలు రూపొందించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సినిమా థియేటర్లు, టీవీలు, ఇతర మాధ్యమాల్లో ప్రదర్శించాలని ఆయా శాఖలను ఆదేశించారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలు ఎలా తయారు చేయాలని, అవి ప్రజలకు చేరువయ్యే విధానంపై అధికారులు, మంత్రులకు సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు.