120 మందిని రేప్ చేసిన పూజారి అరెస్ట్

First Published 21, Jul 2018, 6:21 PM IST
Haryana temple priest arrested for raping, filming 120 women
Highlights

120 మంది మహిళలను రేప్ చేసిన ఓ పూజారిని  హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ లోని బాబా బాలక్ నాథ్ ఆలయంలో బాబా ఆమ్రపురి అనే వ్యక్తి పూజారిగా ఉన్నాడు.


చంఢీఘడ్: 120 మంది మహిళలను రేప్ చేసిన ఓ పూజారిని  హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ లోని బాబా బాలక్ నాథ్ ఆలయంలో బాబా ఆమ్రపురి అనే వ్యక్తి పూజారిగా ఉన్నాడు.

ఈ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న పూజారి  ఆలయానికి వచ్చే మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు.  అయితే పూజారి మహిళలసై అత్యాచారాలకు పాల్పడిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో  ప్రత్యక్షమయ్యాయి. 

దీంతో పోలీసులు పూజారి నివాసంలో  వీడియోలను స్వాధీనం చేసుకొన్నారు.  కనీసం 120 మందిపై పూజారి రేప్ చేశారని  పోలీసులు చెబుతున్నారు.  పలువురిపై పూజారి రేప్ చేసిన వీడియోలను పోలీసులు  స్వాధీనం చేసుకొన్నారు. 

ఈ వీడియోలను చూపిస్తూ బాధితులపై అత్యాచారానికి పాల్పడ్డారని  పోలీసులు తెలిపారు.  అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలని  మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

loader