Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో పెరుగుతున్న హెచ్3ఎన్2, కోవిడ్ వైరస్.. అలెర్ట్ అయిన ఆరోగ్య శాఖ.. తాజా మార్గదర్శకాలు జారీ

మహారాష్ట్రలో కోవిడ్-19, హెచ్3ఎన్2 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఎదుర్కోవడానికి పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. 

H3N2 And Covid virus increasing in Maharashtra.. Health department alerted.. Latest guidelines issued
Author
First Published Mar 17, 2023, 1:39 PM IST

మహారాష్ట్రలో హెచ్3ఎన్2, కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.  ఈ రెండు వైరస్ ల వ్యాప్తి ఎక్కువ అవుతుండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సమక్షంలో గురువారం ఆరోగ్య శాఖ సమావేశం జరిగిందని, అందులో అన్ని హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ఉద్ధవ్ ఠాక్రేను సీఎంగా పునరుద్ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య.. ‘కానీ నీవు రాజీనామా చేశావ్ కదా’

రాష్ట్రంలో హెచ్3ఎన్2 వైరస్ విజృంభిస్తున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సావంత్ అన్నారు. ప్రజలు రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. మాస్కులు ధరించాలని తెలిపారు. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని చెప్పారు. రాష్ట్రంలో హెచ్3ఎన్2, కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 352 హెచ్ 3ఎన్ 2 కేసులు నమోదయ్యాయని, వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి సావంత్ తెలిపారు. వాతావరణంలో మార్పు వచ్చిందని, ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని ఆరోగ్య మంత్రి సావంత్ అన్నారు. జ్వరం ఉంటేనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

బర్త్ డే జరిగిన 3 నెలలకు వీడియో వైరల్.. యూట్యూబర్ అరెస్ట్.. కారణం ఏంటంటే..

కాగా.. గత వారంలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగిన మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ 19 పరిస్థితిని సూక్ష్మ స్థాయిలో పరిశీలించాలని గురువారం లేఖ రాసింది. ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే ఇది చోటు చేసుకుంది. 

మహారాష్ఠ్రలో ఇప్పటి వరకు హెచ్3ఎన్2 బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఈ నెల 15వ తేదీన అహ్మద్ నగర్ లో ఎంబీబీఎస్ చదువుతున్న యువకుడు చనిపోయాడు. ఇదే వైరస్ తో నాగ్ పూర్ లో 72 ఏళ్ల వృద్ధుడి గురువారం మరణించాడు. ఈ రెండు కేసుల్లో బాధితులు కోవిడ్ -19, హెచ్3ఎన్ 2 పాటు వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే వీరి మరణాలకు కచ్చితమైన కారణాలు మరో 24 గంటల్లో తెలుస్తాయని అధికారులు చెప్పారు.

రాహుల్ గాంధీ యాంటీ నేషనలిస్ట్ టూల్ కిట్ లో భాగమయ్యారు - బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

హెచ్ 3ఎన్ 2 లక్షణాలలో దీర్ఘకాలిక జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, ముక్కు కారడం, తీవ్రమైన సందర్భాల్లో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఉబ్బసం వంటివి ఉన్నాయి. వీటికి తక్షణ చికిత్స అవసరం అని ఆరోగ్య శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా.. హెచ్ 3ఎన్ 2 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో అన్ని పాఠశాలలకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పలు స్వచ్ఛంధ సంస్థలు, సంఘాల నుంచి విజ్ఞప్తులు రావడంతో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios