Asianet News TeluguAsianet News Telugu

ఉద్ధవ్ ఠాక్రేను సీఎంగా పునరుద్ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య.. ‘కానీ నీవు రాజీనామా చేశావ్ కదా’

మహారాష్ట్రలో 2022లో జరిగిన నాటకీయ పరిణామాలపై ఠాక్రే, షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. గవర్నర్ ఆదేశాలను రద్దు చేసి మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రేను పునరుద్ధరించాలనే వాదనలను కోర్టు విన్నది. కానీ, ఫ్లోర్ టెస్టుకు ముందే సీఎంగా ఠాక్రే రాజీనామా చేశాడు కదా అని అడిగింది.
 

supreme court on reistating uddhav thackeray as maharashtra cm, but you resigned
Author
First Published Mar 17, 2023, 1:05 PM IST

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో 2022లో చోటుచేసుకున్న నాటకీయ రాజకీయ పరిణామాలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. శివసేనలో చీలిక ఏర్పడి.. ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్‌నాథ్ సిండే సారథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి దిగిపోయిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపిన తర్వాత వారి అభ్యర్థన మేరకు అప్పటి గవర్నర్ బీఎస్ కొశ్చారీ 2022 జూన్‌లో ఉద్ధవ్ ఠాక్రే విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ఆర్డర్‌లు జారీ చేశారు. ఈ ఆర్డర్‌లు రద్దు చేసి మహారాష్ట్ర సీఎంగా మళ్లీ ఉద్ధవ్ ఠాక్రేను నియమించాలని ఆయన వర్గం పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కానీ, ఫ్లోర్ టెస్టుకు ముందే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశాడు కదా? అని పేర్కొంది. 

శివసేన ఎమ్మెల్యేల మధ్య బేధాభిప్రాయాలు ఉన్న కారణంగా విశ్వాస పరీక్షకు గవర్నర్ ఆదేశాలు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు ఇటీవలే ప్రశ్నించింది. ఈ తరుణంలోనే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడి గవర్నర్ ఆదేశాలను రద్దు చేయాలని ఉద్ధవ్ ఠాక్రే తరఫు న్యాయవాది కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఠాక్రే తరఫు వాదిస్తున్న మరో న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదనలనూ విన్నది. వెంటనే.. ‘అంటే మీ ప్రకారం, మేం ఏం చేయాలి? మీకు మళ్లీ అధికారాన్ని అందించాలి? కానీ, మీరు అప్పటికే రాజీనామా చేశారు కదా. అంటే.. బలపరీక్షకు ముందే రాజీనామా చేసిన ప్రభుత్వాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోర్టును అడుగుతున్నట్టు ఉన్నది’ అని సమాధానం ఇచ్చింది.

న్యాయమూర్తులు ఎంఆర్ షా, క్రిష్ణ మురారీ, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహాలూ ఉన్న ఈ  ధర్మాసనం.. ఠాక్రే వర్గం, షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసింది. ఫ్లోర్ టెస్టును కనీసం ఎదుర్కోనూ లేని ముఖ్యమంత్రిని కోర్టు ఎలా మళ్లీ సీఎంగా పునరుద్ధరించాలి? అని ఏఎం సింఘ్వీని కోర్టు అడిగింది.

Also Read: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలంగాణ పైలట్ వినయ్ భాను రెడ్డి మృతి...

అరుణాచల్ ప్రదేశ్‌లో టుకిని మళ్లీ సీఎంగా పునరుద్ధరించిన 2016 నబమ్ రెబియా జడ్జిమెంట్‌ను సింఘ్వీ ప్రస్తావించారు. 2022 జూన్ 29న సీఎం రాజీనామా ఇర్రెలివెంట్..  ఎందుకంటే గవర్నర్ చట్టవిరుద్ధ  ఆదేశాలను అమలు జరిపినప్పుడు ఆ విశ్వాస పరీక్ష ఫలితాలను ముందే ఊహించగలమని, అసలు అందుకు మాజీ సీఎం ఠాక్రేను సబ్జెక్ట్‌ చేయాల్సిన అవసరమే లేదని తెలిపారు. గవర్నర్ ఆదేశాలు అక్రమమే ఎందుకంటే షిండే వెంట ఉన్న 34 మంది ఎమ్మెల్యేలను ఆయన గుర్తించిన తర్వాతే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి అని వివరించారు. ఆ ఎమ్మెల్యేల గుర్తింపు ఏమిటీ? శివసేననే కదా? పార్టీలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను ప్రత్యేక పార్టీగా లేదా వర్గంగా గవర్నర్ ఎలా గుర్తించారు? అని అడిగారు. 

సింఘ్వీకి సమాధానంగా సీజేఐ మాట్లాడారు. యథాతథ స్థితిని పునరుద్ధరించడానికీ ఒక లాజిక్ ఉంటుందని, ఫ్లోర్ టెస్టులో ఓడినా సరే.. ఫ్లోర్ టెస్టులో ఓడించి అధికారం నుంచి తొలగించారనే సందర్భంలోనూ దాన్ని పక్కన పెట్టొచ్చని వివరించారు. కానీ, ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే ఆ విశ్వాస పరీక్షను ఎదుర్కోనేలేదు అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios