మైనర్ బాలికపై ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. గిఫ్ట్ ఇస్తానని నమ్మించి బాలికను బహుళ అంతస్థు భవనంపైకి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం బలవంతంగా గర్భనిరోధక మాత్రలు మింగించాడు. ఈ సంఘటన గుడ్ గావ్ లో చోటుచేసుగా... నిందితుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... సోనీపట్ ప్రాంతానికి చెందిన అరుణ్ శర్మ(21) అనే యువకుడు లిఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. కాగా.. సోమవారం తాను పనిచేస్తున్న భవనంలోని ఓ మైనర్ బాలికను పిలిచాడు. రోజూ కనిపించే వ్యక్తే కావడంతో బాలిక అతని వద్దకు వెళ్లింది.  గిఫ్ట్ ఇస్తానని నమ్మించి భవనం పైకి తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం బాలిక చేత బలవంతంగా గర్భనిరోదక మాత్రలు మింగించాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బాలికను బెదిరించాడు.

కాగా... బాలిక ప్రైవేటు పార్ట్స్ వద్ద తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాలిక నొప్పి భరించలేక విషయాన్ని తల్లికి వివరించింది. దీంతో.. ఆమె వెంటనే బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అత్యాచారం జరిగినట్లు వారు గుర్తించారు. అనంతరం బాలిక తల్లి సదరు యువకుడిపై ఫిర్యాదు చేయగా... పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.