Asianet News TeluguAsianet News Telugu

వడోదరలోని ఫ్యాక్టరీపై గుజరాత్ ఏటీఎస్ దాడులు.. రూ. 500 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం

గుజరాత్ లోని వడోదరలో ఉన్న మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో డ్రగ్స్ ను ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు. 

Gujarat ATS raids on factory in Vadodara.. Rs. 500 crore worth of drugs seized
Author
First Published Nov 30, 2022, 4:12 PM IST

గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వడోదర నగర శివార్లలోని ఓ ఫ్యాక్టరీపై దాడి చేసింది. ఈ దాడిలో సుమారు రూ. 500 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. మంగళవారం రాత్రి వడోదర సమీపంలోని చిన్న ఫ్యాక్టరీ-కమ్-గోడౌన్ వద్ద దాడి చేశామని, అక్కడి నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు ఓ ఏటీఎస్ అధికారి తెలిపారు. 

చట్టబద్ధంగా రసాయనాల తయారు చేస్తున్నామంటూ, ఆ ముసుగులో డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాలను తయారు చేస్తున్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆయన వివరించారు.

గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోవచ్చు: అమిత్ షా

కాగా.. ఈ ఏడాది ఆగస్టులో వడోదర నగరం సమీపంలోని ఓ గోదాం నుంచి దాదాపు రూ.1,000 కోట్ల విలువైన 200 కిలోల పార్టీ డ్రగ్ మెఫెడ్రోన్‌ను ఏటీఎస్ ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీన గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌ కలిసి సంయక్తంగా ఓ ఆపరేషన్ చేశాయి. నిఘా వ‌ర్గాల స‌మాచారం మేర‌కు అరేబియా సముద్రంలో పాకిస్థానీ షిప్ ను అడ్డగించాయి. ఆ ప‌డ‌వ నుంచి దాదాపు 50 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.350 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ పడవను జఖౌ (కచ్)కి తీసుకువచ్చారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం..  విశ్వ‌సనీయ స‌మాచారం మేర‌కు పాకిస్థాన్ కు చెందిన షిప్ ను  ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి)  అధికారులు తనిఖీ చేశారు. వారికి 350 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌తో పాకిస్తాన్ చెందిన ఆరుగురు స్మ‌గ్ల‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఉదయాన్నే రోజూ కోడికూస్తోందని... పోలీసులకు ఫిర్యాదు...!

ఈ సంవత్సరంలో గుజారాత్ ఏటీఎస్ తో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన సంయుక్తంగా నిర్వహించిన ఆరో ఆపరేషన్ ఇది. అంతకుముందు సెప్టెంబర్ 14న పాకిస్థాన్ బోటులో సుమారు రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ పట్టుబడింది. రెండు నెలల వ్యవధిలోనే ఏటీఎస్, కోస్ట్ గార్డ్ ఈ రెండు విజయాలను సాధించాయి. 2021 అక్టోబర్ లో గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ లో 2,988 కిలోల హెరాయిన్‌ను ఏటీఎస్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంత‌ర్జాతీయ మార్కెట్ లో రూ. 21,000 కోట్లుగా అంచనా వేశారు. గుజరాత్ తీరానికి సమీపంలో జరిగిన అతిపెద్ద డ్రగ్స్ రవాణాలో ఇది ఒకటిగా నిలిచింది. 

'శ్రద్ధ శరీర భాగాలు ఫ్రిజ్‌లో ఉన్నాయని తెలియదు. రెండుసార్లు అఫ్తాబ్ ఫ్లాట్‌కి వెళ్లాను'

కాగా.. మ‌ద‌క‌ద్ర‌వ్యాల క‌ట్టిడిపై భార‌త భద్ర‌త బలాగాలు ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నాయి. ఏ మాత్రం అనుమానం వ‌చ్చినా.. ఎవ‌రినైనా అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. గత కొన్ని నెలలుగా గుజరాత్ ఏటీఎస్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్ర‌మంలో ఏటీఎస్ ఇలా దాడులు చేపడుతోంది. పలు సందర్భాల్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ తో కలిసి ఆపరేషన్లు నిర్వహిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios