Asianet News TeluguAsianet News Telugu

భారత్ జోడో యాత్ర ... రాహుల్ గాంధీపై కేసు, కేజీఎఫ్ 2 వల్లే

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. కేజీఎఫ్ 2 పాటలను తమ అనుమతి లేకుండా వినియోగించుకున్నారంటూ రాహుల్ గాంధీ, తదితరులపై బెంగళూరుకు చెందిన ఎంఆర్‌టీ మ్యూజిక్ అనే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

case filed on congress mp rahul gandhi
Author
First Published Nov 4, 2022, 9:52 PM IST

భారత్ జోడో పేరిట పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. పాదయాత్ర సందర్భంగా కన్నడ హిట్ చిత్రం కేజీఎఫ్ 2 పాటలను తమ అనుమతి లేకుండా వినియోగించుకున్నారంటూ రాహుల్ గాంధీ, తదితరులపై బెంగళూరుకు చెందిన ఎంఆర్‌టీ మ్యూజిక్ అనే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటేలు కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ పాటల హక్కుల కోసం తాము పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించామని... అలాంటప్పుడు తమ అనుమతి లేకుండా కాంగ్రెస్ నేతలు ఈ పాటలను ఎలా వాడుకుంటారని ఎంఆర్‌టీ ప్రతినిధులు మండిపడుతున్నారు. కేజీఎఫ్ 2 సినిమాలోని పాటల ఆధారంగా రాహుల్ గాంధీ ప్రచారం వీడియోలు రూపొందిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ALso REad:భారత్ జోడో యాత్ర: నేడు పాదయాత్రకు రాహుల్ విరామం

ఇకపోతే... తెలంగాణ రాష్ట్రంలో  రాహుల్  గాంధీ పాదయాత్ర ఇవాళ్టికి  10వ రోజుకు చేరుకుంది.  గత నెల 23న   రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటక రాష్ట్రం నుండి  తెలంగాణలోకి  ప్రవేశించింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర సంగారెడ్డి  జిల్లాలో కొనసాగుతుంది. గత  నెల  23న రాష్ట్రంలోకి యాత్ర ప్రవేశించింది.అయితే అదే  రోజున నాలుగు  కి.మీ పాదయాత్ర నిర్వహించిన తర్వాత యాత్రకు రాహుల్ గాంధీ విరామం ఇచ్చారు.గత  నెల 27నుండి యాత్ర పున: ప్రారంభమైంది.గత నెల 4,5  తేదీల్లో కర్ణాటకలో యాత్ర సాగే  సమయంలో  రాహుల్ గాంధీ యాత్రకి  విరామం  ఇచ్చారు.

మరో  ఐదు రోజుల పాటు  తెలంగాణలో రాహుల్  గాంధీ పాదయాత్ర సాగనుంది.కాంగ్రెస్  పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నారు.యాత్రకు  విశేష  స్పందన లభిస్తుందని ఆ   పార్టీ  నేతలు చెబుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ నేతలు  రాహుల్ కు వివరిస్తున్నారు. బోనాలు,కోలాటాలు, పోతు రాజుల  విన్యాసాలతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్  నేతలు రాహుల్ తో కలిసి  పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios