Asianet News TeluguAsianet News Telugu

వస్త్ర పరిశ్రమకు ఊరట: జీఎస్టీ పన్ను పెంపు అమలు వాయిదా

చేనేతతో పాటు వస్త్రాలపై జీఎస్టీని 5 నుండి 12 శాతానికి పెంచుతూ తీసుకొన్న నిర్ణయం అమలును  వాయిదా వేసింది జీఎస్టీ కౌన్సిల్. ఇవాళ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

GST Council defers rate hike on textiles amid protests from states, traders
Author
New Delhi, First Published Dec 31, 2021, 3:52 PM IST

న్యూఢిల్లీ:చేనేతతో పాటు ఇతర వస్త్రాలపై 5 శాతం నుండి 12 శాతానికి జీఎస్టీ పెంపు ప్రతిపాదన అమలును వాయిదా వేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకొంది. శుక్రవారం నాడు 46వ Gst కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి Nirmala Sitharaman అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

Handloom వస్త్రాలపై జీఎస్టీని 5 నుండి 12 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో గతంలో నిర్ణయం తీసుకొన్నారు. 2002 జనవరి 1 నుండి పెంచిన ధరలను అమలు చేయాలని భావించారు. అయితే చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. చేనేత వ్యాపారులు కూడా ఆందోళనకు దిగారు. నిన్న దేశ వ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు వస్త్ర పరిశ్రమ సహా అనుబంధ రంగాలకు చెందిన పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వస్త్ర వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

also read:రేపే జి‌ఎస్‌టి సమావేశం.. రేట్ల తగ్గింపుపై కీలక నిర్ణయం.. హాజరుకానున్న ఆర్థిక మంత్రి..

చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంపును తెలంగాణ రాష్ట్ర మంత్రి Ktr కేంద్రాన్ని కోరారు. ఇటీవలనే మంత్రి కేటీఆర్ ఈ విషయమై కేంద్ర మంత్రికి ట్విట్టర్ ద్వారా విన్నవించారు.జీఎస్టీని పెంచితే వస్త్ర వ్యాపారులు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత న్యూఢిల్లీలో ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చేనేత వస్త్రాల మీద 12శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు.

ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందన్నారు. పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని అన్నారు. రిఫండ్ శాతంపై ఎలాంటి  వివరాలు లేకుండా  నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

వస్త్రాలపై జీఎస్టీ పెంపుపై రాష్ట్రాల నుండి వినతులు: నిర్మలా సీతారామన్

 ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో నిర్వహించిన సమావేశంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతం నుండి 12 శాతానికి పెంచాలని తీసుకొన్న నిర్ణయాన్ని పున: పరిశీలించాలని పలు రాష్ట్రాల నుండి వచ్చినట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు.చేనేత వస్త్రాలపై జీఎస్టీ పన్నులో యథాతథస్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నామని ఆమె తెలిపారు. 

Textiles లో ఇన్వర్షన్ ను సరిదిద్దే నిర్ణయాన్ని రేట్ల రేషనలైజేషన్ కమిటీకి సూచించినట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ కమిటీ 202 పిబ్రవరి లో నివేదికను సమర్పించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. పాదరక్షలపై జీఎస్టీ పన్ను తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios