Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష.. ఏ కేసులో అంటే ?

మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష పడింది. 1996లో గ్యాంగ్‌స్టర్ చట్టం కింద నమోదైన 5 కేసుల్లో ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు దోషిగా తేల్చింది. జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల ఫైన్ కూడా వేసింది. 

 

Gangster Mukhtar Ansari was sentenced to ten years in prison.. in which case?
Author
First Published Dec 15, 2022, 5:06 PM IST

1996లో గ్యాంగ్‌స్టర్ చట్టం కింద నమోదైన 5 కేసుల్లో పూర్వాంచల్ మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీని ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు దోషిగా నిర్ధారించి పదేళ్ల శిక్ష విధించింది. దీంతో పాటు కోర్టు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. ఆయనతో పాటు భీమ్ సింగ్‌కు కూడా పదేళ్ల శిక్ష పడింది. ఈ శిక్ష తీర్పు విన్న ముఖ్తార్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. 

మోటారు పంప్‌ అమర్చుతూ.. విద్యుదాఘాతంతో నలుగురు మృతి.. మృతుల్లో తండ్రీకొడుకులు

1996లో ఘాజీపూర్‌లో ముఖ్తార్ అన్సారీ, భీమ్ సింగ్‌లపై సదర్ కొత్వాలిలో గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసు ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో విచారిస్తోంది. డిసెంబర్ 12న క్రాస్ ఎగ్జామినేషన్, వాంగ్మూలం పూర్తయిన తర్వాత.. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయంలో గతంలో కూడా నవంబర్ 25న నిర్ణయం రావాల్సి ఉండగా ప్రిసైడింగ్ అధికారి బదిలీ కావడంతో అది ఆగిపోయింది.

10 రూపాయిల కోసం గొడవ.. స్నేహితుడి దారుణ హత్య.. పశ్చిమ బెంగాల్ లో ఘటన

మనీలాండరింగ్ కేసులో ప్రయాగ్‌రాజ్‌లో ముఖ్తార్ అన్సారీ పది రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది. అయితే ఈ కేసు తుది తీర్పు కోసం ఆయన ఘాజీపూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో హాజరుకావాల్సి ఉంది. కానీ ఆయన ఈడీ అదుపులో ప్రయాగ్‌రాజ్‌లో ఉండటం వల్ల  ఈడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు చేశారు. కాగా తుది తీర్పునకు ముందే ముఖ్తార్ ఉదయం నుండి ఉద్వేగంగా ఉన్నారు. కేసు తీర్పు వెలువరేంత వరకు తనను విచారించవద్దని  ముక్తార్ అన్సారీ ఈడీ అధికారులను అభ్యర్థించారు.

శ్రద్ధా హత్య కేసులో మరో కీలక పరిణామం.. ఆ ఎముకలు శ్రద్దావే.. డీఎన్ఏ రిపోర్టులో స్పష్టత..

ముఖ్తార్ విజ్ఞప్తిని ఈడీ అధికారులు అంగీకరించారు. నేడు విచారణ జరపలేదు. కానీ బుధవారం ఆలస్యంగా విచారణ ప్రారంభమై తెల్లవారుజామున 4.30 గంటల వరకు కొనసాగించారు. అయితే ఈ కేసులో తనకు అనుకూలంగా తీర్పు రావాలని ముక్తార్ ఉదయం నుంచి ప్రార్థించాడు. 31 ఏళ్ల క్రితం వారణాసిలో కాంగ్రెస్‌ నేత అజయ్‌ రాయ్‌ అన్న అవధేష్‌ రాయ్‌ హత్య, అడిషనల్‌ ఎస్పీపై హత్యాకాండతో సహా ఐదు కేసుల ఆధారంగా ముఖ్తార్‌పై 1996లో గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్ ను ప్రయోగించారు.

కీచక హెడ్‌మాస్టర్ భరతం పట్టిన విద్యార్థినులు.. చితకబాది పోలీసులకు అప్పగించిన హాస్టల్ స్టూడెంట్లు (వీడియో)

కాగా.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ, రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్న వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని బండా జైలులో ఉన్నారు. 2021లో అన్సారీపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆయన జైలులో ఉన్న సమయంలోనే అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఇదిలా ఉండగా అతడి కుమారుడు అబ్బాస్ అన్సారీని కూడా నవంబర్‌లో ఈడీ ప్రయాగ్‌రాజ్‌లోని సబ్ జోనల్ కార్యాలయంలో ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది. దీని తర్వాత ముఖ్తార్ అన్సారీ బావ అతిఫ్ రజా కూడా అరెస్ట్ అయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios