Asianet News TeluguAsianet News Telugu

10 రూపాయిల కోసం గొడవ.. స్నేహితుడి దారుణ హత్య.. పశ్చిమ బెంగాల్ లో ఘటన

పది రూపాయిల కోసం ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ మొదలైంది. ఇది తీవ్ర వాగ్వాదంగా మారింది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఓ స్నేహితుడు మరో స్నేహితుడిని హతమార్చారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. 

A fight for 10 rupees.. brutal murder of a friend.. an incident in West Bengal
Author
First Published Dec 15, 2022, 3:40 PM IST

10 రూపాయిల కోసం మొదలైన గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఓ స్నేహితుడు మరో స్నేహితుడిని దారుణంగా హతమార్చారు. బండరాళ్లతో మోది చంపేశారు. ఈ ఘటన ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో చోటు చేసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి. రాంప్రసాద్ సాహా (20), సుబ్రతా దాస్ (22), అజయ్ రాయ్ (22), ముగ్గురు స్నేహితులు. వీరంతా కలిసి సోమవారం డ్రగ్స్ తీసుకోవడానికి బైకుంత్‌పూర్ అడవలోకి వెళ్లారు. అయితే మత్తులోకి వెళ్లిన తరువాత సాహా తన వద్ద డబ్బు లేదని గుర్తించారు. తనకు డ్రగ్స్ కొనేందుకు రూ.10 ఇవ్వాలని సుబ్రత రాయ్ ను సాహా అడిగాడు. కానీ దానికి అతడు నిరాకరించాడు. 

శ్రద్ధా హత్య కేసులో మరో కీలక పరిణామం.. ఆ ఎముకలు శ్రద్దావే.. డీఎన్ఏ రిపోర్టులో స్పష్టత..

దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఇది ముదిరిపోయి తీవ్ర వాగ్వాదంగా మారింది. ఈ క్రమంలో క్షణికావేశంలో సుబ్రత సాహాను బండ రాయితో కొట్టి చంపాడు. అనంతరం మరో స్నేహితుడితో కలిసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అడవిలో పోలీసులకు మృతదేహం లభ్యమైంది. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. బుధవారం రాత్రి సుబ్రత, అజయ్‌లను సిలిగురి మెట్రో పోలీసుల అషిఘర్ ఔట్‌పోస్టు అధికారులు అరెస్టు చేశారు. అయితే దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సహా డ్రగ్స్ కు బానిసయ్యాడని, క్రమం తప్పకుండా అడవికి వెళ్తూ ఉండేవాడని చెప్పారు. మొత్తం ఘటనలో అజయ్ పాత్రను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కీచక హెడ్‌మాస్టర్ భరతం పట్టిన విద్యార్థినులు.. చితకబాది పోలీసులకు అప్పగించిన హాస్టల్ స్టూడెంట్లు (వీడియో)

ఇలాంటి తరహా ఘటనే మహారాష్ట్రలో నేడు వెలుగులోకి వచ్చింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు పొరిగింటి మహిళను హత్య చేశాడు. థానే జిల్లా డోంబివిలీ ప్రాంతంలో 44 ఏళ్ల వైశాలి మస్దూద్‌ అనే మహిళ నివసిస్తోంది. ఆమె నివసించే ఇంటి సమీపంలో నిందితుడు నివసిస్తున్నాడు. అయితే అతడు తాగుడికి బానిసయ్యాడు. తరచూగా వైశాలిని, ఆమె కుమారుడిని మద్యం తాగేందుకు డబ్బులు అడిగేవాడు. అప్పు తీసుకునేవాడు. 

సైరస్ మిస్త్రీ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి.. నిందితురాలు పలుమార్లు ..

అయితే అతడి తీరుతో తల్లీ కుమారులకు విసిగెత్తిపోయింది. ఇక నుంచి నిందితుడికి డబ్బులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం అతడు వైశాలి దగ్గరకు వచ్చాడు. మద్యం తాగేందుకు డబ్బులు అప్పు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతడికి కోపం వచ్చింది. ఆక్రోశంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios