Asianet News TeluguAsianet News Telugu

శ్రద్ధా హత్య కేసులో మరో కీలక పరిణామం.. ఆ ఎముకలు శ్రద్దావే.. డీఎన్ఏ రిపోర్టులో స్పష్టత..  

శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులకు ఎట్టకేలకు కొన్ని ప్రధాన ఆధారాలు లభించాయి. ఢిల్లీ, గురుగ్రామ్ అడవుల్లో శ్రద్దా ఎముకలు లభించాయి. అవి శ్రద్ధాకు చెందినవని డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారించారు. 

Shraddha Walkar Bones Found In Delhi Forests Dna Test Confirms
Author
First Published Dec 15, 2022, 3:20 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక ఆధారాలు లభించాయి. ఢిల్లీ, గురుగ్రామ్ అడవుల్లో లభించిన ఎముకలు శ్రద్ధాకు చెందినవని డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారించారు. జాతీయ మీడియా సంస్థ ANI తెలిపిన వివరాల ప్రకారం..విచారణలో పోలీసులకు దొరికిన ఎముకల డీఎన్‌ఏ శాంపిల్స్‌.. శ్రద్ధా తండ్రి డీఎన్ ఏతో సరిపోయింది. ఢిల్లీ పోలీసులు మెహ్రౌలీ, గురుగ్రామ్ అడవుల్లో ఈ ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక ఇచ్చింది.

కేసు రుజువు చేయడంలో పోలీసులకు ఈ నివేదిక కీలక మలుపు కానున్నది. శ్రద్ధ హత్యకు సంబంధించిన అభియోగం అఫ్తాబ్ అమీన్ పూనావల్లపై ఉంది. శ్రద్ధను అత్యంత దారుణంగా చంపి, ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో విసిరినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు అఫ్తాబ్..  శ్రద్ధతో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసించాడు. అతను శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలుగా నరికి చంపిన తర్వాత వాటిని  రిఫ్రిజిరేటర్‌లో ఉంచాడని ఆరోపించారు. 

శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా పై పూనావల్ల పాలిగ్రాఫ్‌, నార్కో టెస్ట్‌లు జరిగాయి. వాటి రిపోర్టు కూడా సిద్ధమైంది. ఈ నివేదికను దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌కు అందజేసినట్లు వర్గాలు చెబుతున్నాయి. అయితే..  ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అయితే పాలిగ్రాఫ్ పరీక్ష నివేదికను రోహిణి ఎఫ్‌ఎస్‌ఎల్ తయారు చేసిందని, దానిని పోలీసులకు అందజేశామని వర్గాలు చెబుతున్నాయి.

పాలీగ్రాఫ్ రిపోర్టులో పోలీసులు అనేక కొత్త విషయాలు కనుగొన్నట్లు సమాచారం. అఫ్తాబ్ గతంలో పోలీసుల ఇంటరాగేషన్‌లో చెప్పిన విషయాలనే ఈ టెస్ట్‌లోనూ పునరావృతం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ నివేదికలన్నీ పోలీసులు సాక్ష్యంగా కోర్టులో సమర్పించవచ్చు. ఎందుకంటే.. నిందితులు పోలీసుల ముందు చెప్పే వాంగ్మూలాలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ, అఫ్తాబ్ నేరాన్ని కోర్టులో నిరూపించేందుకు ఈ నివేదికలు పోలీసులకు సహాయపడతాయి. ఒకట్రెండు రోజుల్లో నార్కో టెస్టు రిపోర్టు కూడా రానుందని చెబుతున్నారు.

శ్రద్ధా తండ్రి ఏం చెప్పాడు?

2019లో అఫ్తాబ్‌తో లివ్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉండాలని కూతురు తనతో చెప్పిందని, అయితే.. అబ్బాయి ముస్లిం కావడంతో అందుకు నిరాకరించిందని శ్రద్ధా తండ్రి చెప్పడం గమనార్హం. మా నిరాకరించడంతో శ్రద్ధ ..  తనకు 25 ఏండ్లనీ,స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు తనకు ఉందని చెప్పి  అఫ్తాబ్‌తో వెళ్లిపోయిందని శ్రద్ధా తండ్రి పోలీసులకు చెప్పారు.

శ్రద్ధా హత్య కేసు

ఢిల్లీ పోలీసుల ప్రకారం.. అఫ్తాబ్ అమీన్ పూనావాలా మే 18 సాయంత్రం తన 'లివ్-ఇన్ పార్ట్‌నర్' శ్రద్ధా వాకర్ (27)ని గొంతు కోసి చంపి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. నిందితుడు దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని తన నివాసంలో ఒక పెద్ద ఫ్రిజ్‌లో శరీర భాగాలను సుమారు మూడు వారాల పాటు ఉంచాడు. తరువాత చాలా రోజుల పాటు వాటిని వేర్వేరు భాగాలలో విసిరాడు.

Follow Us:
Download App:
  • android
  • ios