మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో ఉన్న గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ ను, ఆ స్కూల్ కు సంబంధించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్ వివాదం నేపథ్యంలోనే వారి అరెస్టు జరిగింది. 

మధ్యప్రదేశ్ లోని దామోహ్ లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్ లో తలెత్తిన హిజాబ్ వివాదం నేపథ్యంలో ఆ స్కూల్ ప్రిన్సిపల్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ స్కూల్ కు చెందిన హిందూ విద్యార్థినులు హిజాబ్ లాంటి కండువా ధరించిన ఫొటోల్లో కనిపించడంతో చెలరేగిన హిజాబ్ వివాదం వల్ల ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

బెంగళూరులోని చోర్ బజార్ లో డచ్ యూట్యూబర్ కు చేదు అనుభవం.. వ్లాగింగ్ చేస్తుండగా దాడి.. నెటిజన్ల ఆగ్రహం

దామోహ్ లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్ లో ప్రతిభావంతులైన విద్యార్థుల ఫొటోలు, సాధించిన మార్కులతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లలో పలువురు విద్యార్థినులు తలకు హిజాబ్ లాంటి కండువా ధరించి కనిపించడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పిల్లల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు పాఠశాల యాజమాన్య కమిటీకి చెందిన 10 మందిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

శరీరాన్ని అసభ్యంగా తాకుతూ, 40 మంది దాడి చేశారని ఆర్మీ జవాను భార్య

అయితే ఈ వివాదం నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దామోహ్ లోని పాఠశాల గుర్తింపును రద్దు చేసింది. అంతేకాకుండా ఈ పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు మతమార్పిడులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఆ ఆరోపణల్లో కొంత వాస్తవం ఉందని కొందరు ఉపాధ్యాయులు అంగీకరించారు. అంతేకాకుండా, నమాజ్ చేయమని బలవంతం చేశారని, ఇస్లామిక్ వచనాలను పఠించమని బలవంతం చేశారని చాలా మంది పిల్లలు ఆరోపించారు.

బిపార్జోయ్ తుఫాను బీభత్సం.. ముంబై విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు

రాష్ట్ర రాజధాని భోపాల్ కు 250 కిలోమీటర్ల దూరంలోని ఉన్న ఈ స్కూల్ యాజమాన్యం హిందూ విద్యార్థులను హిజాబ్ ధరించాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని వీహెచ్ పీ, ఏబీవీపీతో పాటు పలు మితవాద సంస్థలు ఆందోళన చేపట్టాయి. హిందూ విద్యార్థులు కూడా హిజాబ్ ధరించిన ఆ పోస్టర్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనూంగో దామోహ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే పాఠశాలకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చారని ఆరోపిస్తూ దామోహ్ జిల్లా విద్యాధికారిపై ముగ్గురు బీజేపీ కార్యకర్తలు సిరా విసిరారు. ఈ చర్యకు పాల్పడిన ముగ్గురు బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.