ఓ డచ్ యూట్యూబర్ బెంగళూరులోని చోర్ బజార్ లో వ్లాగింగ్ చేస్తుండగా ఓ దుకాణదారుడు అతడిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరులో ఓ డచ్ యూట్యూబర్ కు చేదు అనుభవం ఎదురైంది. చిక్ పేటలో రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో వీడియో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించిన ఆ వ్లాగర్ పై ఓ దుకాణదారుడు దాడి చేశాడు. చోర్ బజార్ (థీవ్స్ మార్కెట్)లో డచ్ యూట్యూబర్ పెడ్రో మోటాతో జరిగిన ఈ అవాంఛనీయ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటజన్లు ఆ దుకాణదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శరీరాన్ని అసభ్యంగా తాకుతూ, 40 మంది దాడి చేశారని ఆర్మీ జవాను భార్య
పెడ్రో మోటాతో దాదాపు లక్ష మంది సబ్ స్క్రైబర్లతో ఉన్న రెండు యూట్యూబ్ చానళ్లను నిర్వహిస్తున్నాడు. అందులోని ఓ ఛానెల్ అయిన మ్యాడ్లీ రోవర్ లో ‘అటాక్ ఎట్ ది థీవ్స్ మార్కెట్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ దాడికి సంబంధించిన వీడియోను, తన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు.
బిపార్జోయ్ తుఫాను బీభత్సం.. ముంబై విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు
‘‘భారత్ కు వచ్చే విదేశీయులు బెంగళూరులోని దొంగల మార్కెట్ ను సండే మార్కెట్ లేదా చోర్ బజార్ అని కూడా పిలుస్తారు. అయితే నేను వీడియో తీస్తున్న సమయంలో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి నా చేతిని పట్టుకుని తిప్పాడు. నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా నాపై దాడి చేశాడు. దీంతో అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాను. తరువాత నేను కొంత స్ట్రీట్ ఫుడ్ తిన్నాను. అనంతరం గొప్ప స్థానిక భారతీయ ప్రజలను కలిశాను. కొత్త బటన్డ్ షర్ట్ కోసం బేరసారాలు చేశాను’’ అని ఆ వీడియోలో అతడు వివరించాడు.
విషాదం.. 11 ఏళ్ల మూగ బాలుడిని కరిచి చంపిన వీధి కుక్కలు.. ఎక్కడంటే ?
అయితే ఈ వీడియోను పరిశీలిస్తున్నామని, త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. విదేశీ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు భారత్ లో బహిరంగంగా ఉన్నప్పుడు వేధింపులకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మహారాష్ట్ర, రాజస్థాన్ లలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
