Asianet News TeluguAsianet News Telugu

Netaji: మహాత్మా గాంధీ.. సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు: నేతాజీ కూతురు అనితా బోస్

మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు ఉండేవని నేతాజీ కూతురు అనితా బోస్ పేర్కొన్నారు. అయితే, మహాత్మా గాంధీ అంటే సుభాష్ చంద్రబోస్ ఎంతో ఆరాదన ఉందని వివరించారు. దేశ స్వాతంత్ర్యంలో వీరిద్దరి పాత్ర ఉన్నదని తెలిపారు. ఒకరు లేకుండా మరొకరి పాత్రను చెప్పలేమని తెలిపారు. అయితే, కేవలం నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఐఎన్ఏ వల్లనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని వాదించడం అమాయకత్వమే అవుతుందని పేర్కొన్నారు.
 

gandhi.. netaji shared difficult relationship says chandrabose daughter
Author
New Delhi, First Published Nov 17, 2021, 12:40 PM IST

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయాలు ఇప్పుడు చరిత్ర చుట్టూ తిరుగుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధులు(Freedom Fighters), అంతకు పూర్వం చక్రవర్తుల ప్రస్తావన కూడా వినిపిస్తున్నది. బాలీవుడ్ నటి Kangana Ranaut వ్యాఖ్యలతో స్వాతంత్ర్య సమరం గురించిన చర్చ మళ్లీ వేడెక్కింది. అందులో ముఖ్యంగా Mahatma Gandhi పాత్రపైనా చర్చ జరుగుతున్నది. ఇటీవలే ఆమె మీ హీరోనూ తెలివిగా ఎంచుకోండని పేర్కొంటూ మహాత్మా గాంధీ, Netajiని ప్రస్తావించారు. ఈ తరుణంలోనే నేతాజీ Subhash Chandrabose కూతురు Anita Bose కీలక వ్యాఖ్యలు చేశారు.

తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మధ్య సంబంధాలు కఠినంగా ఉండేవని పేర్కొన్నారు. అయితే, తన తండ్రి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్.. మహాత్మా గాంధీని ఆరాధించేవారని వివరించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలు సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటీష్‌ వారికీ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై ఓ మీడియా సంస్థ స్పందన కోరగా ఆమె ఈ రోజు సమాధానమిచ్చారు.

Also Read: సావర్కర్‌పై రచ్చ.. బీజేపీ ఆయనను జాతిపితగా ప్రకటిస్తుంది.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఒవైసీ మండిపాటు

భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌లు ఇద్దరూ గొప్ప యోధులేనని అనితా బోస్ అన్నారు. ఒకరు లేకుండా మరొకరు ఈ ఘనత సాధించేవారు కాదని పేర్కొన్నారు. ఇద్దరి పోరాటమూ స్వాతంత్ర్యం పొందడానికి దోహపడ్డాయని తెలిపారు. కానీ, కొందరు కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ వాదిస్తున్న.. అహింసా విధానమే భారత‌ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందనేది వాస్తవం కాదని అభిప్రాయపడ్డారు. భారత్‌కు స్వేచ్ఛా వాయువులు అందించడానికి నేతాజీ, ఆయన స్థాపించిన ఇండియన్ నేషన్ ఆర్మీ(ఐఎన్ఏ)ల పాత్రలూ ఉన్నాయని అన్నారు.

అయితే, అదే సమయంలో కేవలం నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఐఎన్ఏ మాత్రమే భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని వాదించడం అర్థరహితమేనని అనితా బోస్ అన్నారు. మహాత్మా గాంధీ చాలా మందిలో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రేరణ తెచ్చారని, అందులో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ కూడా ఒకరు అని వివరించారు. లక్షలాది మంది పౌరులు దేశ స్వాతంత్ర్యానికి పాటుపడ్డారని చెప్పారు.

Also Read: నేతాజీ చిత్రపటంపై వివాదం.. సోషల్ మీడియాలో వైరల్...

కంగనా రనౌత్ ఇటీవలే ఓ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన బ్రిటీష్ పాలనకు పొడిగింపేనని వ్యాఖ్యలు చేశారు. దేశానికి అసలైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందని నోరుపారేసుకున్నారు. అంతేకాదు, 1947లో దేశానికి భిక్షం మాత్రమే లభించిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు దేశమంతా కలవరం రేపాయి. బీజేపీ సహా అన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే, ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. కానీ, అప్పటి నుంచీ తన వాదనను సమర్థించుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు రకాల పోస్టులు చేస్తున్నారు. 

తాజాగా, భారత ప్రజలు తమ యోధుడిని తెలివిగా గుర్తించాలని సూచించారు. ఈ పోస్టులో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌ల గురించి ప్రస్తావించారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌లకు మహాత్మా గాంధీ నుంచి మద్దతు లభించలేదని పేర్కొన్నారు. అంతేకాదు, ఒక చెంప మీద కొడితే మరో చెంపను చూపెట్టే విధానాన్ని ఎగతాళి చేశారు. అహింసా విధానంపైనా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపెట్టే విధానం ద్వారా స్వాతంత్ర్యం రాదని, భిక్షమే లభిస్తుందని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios