మహాత్మా గాంధీ విజ్ఞప్తి మేరకే సావర్కర్ బ్రిటీషర్లకు క్షమాభిక్షను కోరారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయనపై విరివిగా అసత్యాలు ప్రచారంలో ఉన్నాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇలాగే కొనసాగితే త్వరలోనే జాతిపితగా మహాత్ముడిని తప్పించి సావర్కర్‌ను నిలబెడతారని పేర్కొన్నారు. 

న్యూఢిల్లీ: సావర్కర్‌పై మరోసారి రచ్చ జరిగింది. కేంద్ర మంత్రి rajnath singh ఆయనను బలమైన జాతీయ వాది అని ప్రకటించారు. mahatma gandhi విజ్ఞప్తి మేరకే savarkar బ్రిటీషర్లకు క్షమాభిక్ష పత్రం రాశాడని ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. దీనిపై ప్రతిపక్షాలు, మార్క్సిస్టులు అసహనం వ్యక్తం చేశారు. ఏఐఎంఐఎం చీఫ్ asaduddin owaisi ఆ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇలా వ్యాఖ్యలు చేయడమే కాదు.. త్వరలోనే బీజేపీ సావర్కర్‌ను father of the nationగా ప్రకటిస్తుందని ఆరోపించారు.

అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ ‘బీజేపీ నేతలు వక్రీకరించిన చరిత్రను వల్లెవేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, త్వరలోనే వారు జాతిపితగా మహాత్మా గాంధీని తొలగించి సావర్కర్‌ను కూర్చోబెడతారు. మహాత్మాగాంధీ హత్య కేసులో సావర్కర్ నిందితుడు. జస్టిస్ జీవన్ లాల్ కపూర్ దర్యాప్తులో మహాత్ముడి హత్య కేసులో ఆయన భాగస్వాముడని తేలింది’ అని ఒవైసీ అన్నారు.

వీర్ సావర్కర్ అనే బుక్‌ విడుదల కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి మంగళవారం పాల్గొని మాట్లాడారు. ‘ఆయన భారత చరిత్రకు ఐకాన్. ఇకపైనా అలాగే ఉంటాడు. ఆయన గురించి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ, ఆయనను ఒక పిరికివాడుగా చూడటం సరికాదు. ఆయన స్వతంత్ర సమరయోధుడు. బలమైన జాతీయవాది. కానీ, మార్క్సిస్టు, లెనినిస్టు భావజాలాన్ని కలిగి ఉన్నవారు సావర్కర్ ఒక ఫాసిస్టు అని నిందమోపుతుంటారు’ అని కేంద్ర మంత్రి అన్నారు. 

Also Read: మొక్కవోని దేశభక్తి: ద్రోహిపై ప్రతీకారానికి జీవితాన్నే త్యాగం చేసి...

‘సావర్కర్ గురించి అసత్యాలు ప్రచారం చేశారు. జైలు నుంచి విడుదల చేయాలని సావర్కర్ బ్రిటీష్ వారికి ఎన్నో mercy petitionలు రాసినట్టు ప్రచారం చేశారు. క్షమాభిక్ష పిటిషన్ రాయాలని సావర్కర్‌ను కోరిందే మహాత్మా గాంధీ’ అని కేంద్ర రక్షణ మంత్రి పేర్కొనడం దుమారానికి దారితీసింది.

అంతేకాదు, సావర్కర్‌ ఒక అద్భుతమైన మిలిటరీ వ్యూహకర్త అని కేంద్ర మంత్రి కొనియాడారు. 20వ శతాబ్దం తర్వాత మంచి మిలిటరీ వ్యూహకర్త సావర్కర్ అని తెలిపారు. డిఫెన్స్, డిప్లమాటిక్ సూత్రాలను ఆయనే అందించారని చెప్పారు.

హిందూత్వ అనే పదాన్ని తొలిసారిగా కాయిన్ చేసిన వ్యక్తి సావర్కర్. ఆయన వ్యక్తిగతంగా నాస్తికుడని చెబుతుంటారు. 

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా ఇదే తరహాలో సావర్కర్‌పై మాట్లాడారు. సావర్కర్ చెప్పిన హిందూత్వ భావజాలం ప్రజల సంస్కృతి, దేవుళ్లను కొలిచే విధానాల ఆధారంగా వేరు చేయదని వివరించారు. మనం ఎందుకు విభజించాలి? అని సావర్కర్ అంటుండేవాడని భాగవత్ తెలిపారు. మనమంతా ఒకే భూమాత బిడ్డలం, అన్నదమ్ములం అని సావర్కర్ తరుచూ అంటుండేవాడని చెప్పారు. వేర్వేరు మార్గాల్లో దైవాన్ని కొలిచే పద్ధతులు మన దేశ సంస్కృతిలో భాగంగా ఉన్నాయని తెలిపారు. అందరం కలిసి దేశం కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు.

Also Read: మూడు దశల పోరాట వీరులు... గుర్తింపునకే నోచు కోలేదు

అంతేకాదు, సావర్కర్ ముస్లిం వ్యతిరేకి కాదని భాగవత్ స్పష్టం చేశారు. సావర్కర్ ఎన్నో ఘజల్స్ ఉర్దూలో రాశారని ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ వివరించారు.

75ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఇప్పుడు సావర్కర్ చెప్పిన విషయాలన్నీ వాస్తవాలని అనిపిస్తున్నదని భాగవత్ అన్నారు. ప్రజలూ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు అని చెప్పారు.