నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లో బోస్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అయితే ఫొటో వివాదాస్పదంగా మారింది. కోవింద్‌ ఆవిష్కరిస్తున్న ఫొటోను రాష్ట్రపతి భవన్‌ ట్వీట్‌ చేయగానే ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. 

రాష్ట్రపతి ఆవిష్కరించింది నిజమైన నేతాజీ చిత్రపటం కాదని.. 2019లో విడుదలైన ‘గుమ్‌నామీ’ చిత్రంలో బోసు పాత్రలో నటించిన ప్రసేన్‌జిత్‌ చటర్జీ అనే బెంగాలీ నటుడిదని నెటిజన్లు విమర్శించారు. తృణమూల్‌ ఎంపీ మహువామోయిత్రా కూడా దీన్ని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. 

అయితే ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. రాష్ట్రపతి ఆవిష్కరించింది నిజమైన నేతాజీ చిత్రపటాన్నేనని.. బోసు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫొటో ఆధారంగా ప్రముఖ చిత్రకారుడు పరేష్‌ మైటీ ఆ చిత్రాన్ని గీశారని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.