ఆఫరేషన్ సింధూర్ పై భారత ఆర్మీ మాజీ చీఫ్  మనోజ్ ముకుంద్ నరవనే ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఉగ్రవాదంపై పోరాటంతో భారత్ ఇంకా చాలా చేస్తుందని... సినిమా ఇంకా మిగిలుందని ఆయన అన్నారు. 

Operation Sindoor : భారత ఆర్మీ పాకిస్థాన్ భూభాగంలో చొచ్చుకెళ్లిమరీ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన ఈ సైనిక చర్యపై ఇండియన్ మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనే రియాక్ట్ అయ్యారు. అప్పుడే ఏం అయిపోలేదు... ఇంకా సినిమా మిగిలే ఉందంటూ అతడు ఎక్స్ వేదికన ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
Scroll to load tweet…

పహల్గాంలో మినీ న్యూజిలాండ్ గా పిలుచుకునే బైసరన్ వ్యాలీలో ఇటీవల ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. అమాయక టూరిస్ట్ లే టార్గెట్ గా విచక్షణారహితంగా కాల్పులు జరిపి చాలా ప్రాణాలను బలితీసుకున్నారు. మత ప్రాతిపదికన అంటే కేవలం హిందువులనే గుర్తించి మరీ కాల్చిచంపడం యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈ అమానుష చర్యను సీరియస్ గా తీసుకున్న మోదీ సర్కార్ ఉగ్రవాదులపై, వారికి ఆశ్రయం కల్పించి భారత్ పై ఉసిగొల్పుతున్న పాకిస్థాన్ పై తాజాగా దాడులకు దిగింది. 

మంగళవారం అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా భారత ఆర్మీ తన పని కానిచ్చేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి ధైర్యంగా చొచ్చుకెళ్ళిన భారత వాయుసేన యుద్దవిమానాలు సక్సెస్ ఫుల్ గా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసాయి. ఇలా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులపై కూడా భారత్ అటాక్ చేసింది. ఇందులో వందమందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. 

ఇలా భారత ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' పై యావత్ భారతదేశం మాట్లాడుకుంటోంది. ఉగ్రవాదులకు, పాకిస్థాన్ కు ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తగిన గుణపాఠం చెప్పిందని అంటున్నారు. సోషల్ మీడియా మొత్తం ఈ ఆపరేషన్ గురించే పోస్టులు, వీడియోలు. అయితే ఇది ట్రైలర్ మాత్రమే... సినిమా ఇంకా మిగిలుందని మాజీ ఆర్మీ చీఫ్ కామెంట్స ఆసక్తికరంగా మారాయి. ఆర్మీ వ్యవహారాల గురించి బాగా తెలిసిన మాజీ ఆర్మీ చీఫ్ మాటలు ఆసక్తిరంగా మారాయి.