సీబీఐ మాజీ డైరెక్టర్, నాగాలాండ్ మాజీ  గవర్నర్ అశ్వనీ కుమార్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని బ్రోక్‌హోర్ట్స్‌లోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకున్నారు. సిమ్లా పోలీస్ సూపరింటెండెంట్ మోహిత్ చావ్లా అశ్వనీ కుమార్ ఆత్మహత్యను ధృవీకరించారు. అయితే ఆయన గత కొంతకాలంగా డిప్రెషన్‌‌తో తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.