దేశ చరిత్రలోనే మొదటి సారిగా పారా మిలటరీ ఫోర్స్ లో ఇద్దరు మహిళలు ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. సీఆర్‌పీఎఫ్‌లో ఇద్దరు మహిళలు ఐజీ ర్యాంక్ పొంది, ఆర్‌ఏఎఫ్, బీహార్ సెక్టార్ బాధ్యతలను స్వీకరించారు. 

చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇద్దరు మహిళా అధికారులకు ఐజీలుగా పదోన్నతి అందించింది. వారిలో ఒకరిని అల్లర్ల నిరోధక విభాగం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) కు అధిపతిగా, మరొకరిని బీహార్ సెక్టార్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG)గా నియమించింది. మహిళా బెటాలియన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత 35 ఏళ్లలో ఇలా ఇద్దరు మహిళా అధికారులు ఈ స్థాయికి ఎదగడం ఇదే తొలిసారి. సీఆర్‌పీఎఫ్‌ ప్రధాన కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆర్ఏఎఫ్ ఐజీగా అన్నీ అబ్రహం, బీహార్ సెక్టార్ ఐజీగా సీమా ధుండియాను నియమితులయ్యారు. 

మసీదులో మత గ్రంథాల దహనం.. యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఉద్రిక్తత..

1987లో తొలిసారిగా మహిళా అధికారులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో చేర్చారు. ఇప్పుడు ప్రమోషన్ పొందిన ఇద్దరు మహిళలు మొదటి బ్యాచ్ లో శిక్షణ పొందారు. సీఆర్‌పీఎఫ్‌లో సెక్టార్‌కి ఐజీ అధిపతిగా ఉంటారు. దేశంలోనే 3.25 లక్షల మంది సిబ్బందితో అతిపెద్ద పారామిలటరీ దళంగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ లో ఈ తాజా నియామకాలతో 35 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లైంది. 

నేడు ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. ఎక్కడెక్కడంటే ?

ప్రస్తుతం బీహార్ సెక్టార్ ఐజీగా ప్రమోషన్ పొందిన సీమా ధుండియా దేశవ్యాప్తంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పనిచేశారు. పారామిలటరీ దళం సెకెండ్ మహిళా బెటాలియన్‌ను పెంచడంలో ఆమె కృషి చేశారు. లైబీరియాలోని యూఎన్ మిషన్‌లో తొలిసారిగా మొత్తం మహిళా ఫార్మేడ్ పోలీస్ యూనిట్ (ఎఫ్పీయూ)కి ఆగంతుక కమాండర్ గా ధుండియా పని చేశారు. ఆమె ఆర్ఏఎఫ్‌లో డీఐజీగా పనిచేశారు. 

Scroll to load tweet…

అలాగే అన్నీ అబ్రహం కూడా లైబీరియాలోని ఐక్యరాజ్యసమితి మిషన్‌లో మొత్తం మహిళా ఎఫ్పీయూకి కూడా నాయకత్వం వహించారు. ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ఇంటెలిజెన్స్‌ డీఐజీగా కూడా పని చేశారు. ఆమె డీఐజీగా కాశ్మీర్ ఆపరేషన్స్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించారు. సీఆర్, విజిలెన్స్‌ డీఐజీగా కూడా పనిచేశారు. ఈ ఇద్దరు మహిళా అధికారులు రాష్ట్రపతి పోలీసు పతకం, ప్రతిభావంతమైన సేవ, అతి ఉత్కృష్ట్ సేవా పదక్ పతకం ను పొందారు.

మంటల్లో చిక్కుకున్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు.. రెండు రోజుల్లో రెండో ఘటన

ఇదిలా ఉండగా.. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో 1939 జూలై 27న సీఆర్‌పీ అంటే క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ పేరుతో ఈ పారామిలటరీ దళం ఏర్పాటు అయ్యింది. అయితే స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్ల తర్వాత 1949లో దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ పోలీసు దళం సేవలను కొనసాగిస్తూనే దాని పేరును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా మార్చారు. బ్రిటీష్ వారి గుర్తింపును వదిలించుకోవడానికి పటేల్ ఈ చర్యకు పూనుకున్నారు.