ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్‌ లో ఉన్న ఓ మసీదులో పలువురు దుండగులు చొరబడి, ఆ మత గ్రంథంలోని కొన్ని పేజీలను తగుల బెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్‌పూర్‌లో మసీదులో మతగ్రంథాలు దహనమైన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఒక్క సారిగా అక్కడ అశాంతి వాతావరణం ఏర్పడటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తమ బలగాలను మోహరించారు. 

నేడు ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. ఎక్కడెక్కడంటేనగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్లు రువ్వారు. వస్తువులకు మంటలు అంటించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మత గ్రంథాలను తగులబెట్టిన తర్వాత గుర్తు తెలియని నిందితుడు మసీదు నుంచి బయటకు వచ్చారు. ఈ విషయంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో వందలాది మంది ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీని వల్లనే కొంత ఉద్రిక్తత ఏర్పడిందని షాజహాన్‌పూర్‌ ఎస్పీ ఎస్ ఆనంద్ తెలిపారు.

Scroll to load tweet…

మసీదు చుట్టు పక్కల ప్రాంతంలో నిరసనకారులు అందోళన చేసే సమయంలో మంటలు చెలరేగాయి. కానీ పోలీసులు ఆ ప్రాంతాని తమ అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని చల్లబర్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తరువాత వారికి చట్ట ప్రకారం శిక్షిస్తామని పోలీసులు చెప్పారు.

మంటల్లో చిక్కుకున్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు.. రెండు రోజుల్లో రెండో ఘటన

ఈ ఘటనపై స్థానిక ఎస్పీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్వాలి పీఎస్ పరిధిలోని ఓ మత స్థలంలో కొన్ని మత గ్రంథాలకు సంబంధించిన పేజీలను అపవిత్రం చేసినట్లు మాకు సమాచారం అందిందని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రజలతో మాట్లాడి కేసు నమోదు చేశారని చెప్పారు. ‘‘సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నాం. ఘటనా స్థలంలో పోలీసు బలగాలను మోహరించారు’’ అని ఆయన తెలిపారు.