Asianet News TeluguAsianet News Telugu

మంటల్లో చిక్కుకున్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు.. రెండు రోజుల్లో రెండో ఘటన

మహారాష్ట్రలోని నాసిక్-పూణె హైవేపై ఎంఎస్ఆర్టీసీకి చెందిన బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఇతర వాహనాల డ్రైవర్ లు ఆ బస్సు డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో 45 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 

Maharashtra RTC bus caught in fire... Passengers survived... Second incident in two days
Author
First Published Nov 2, 2022, 10:55 PM IST

మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ ఆర్టీసీ)కి చెందిన శివషాహి బస్సు మంటల్లో చిక్కుకుంది. బుధవారం నాసిక్-పూణె హైవేపై బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఉదయం పూట ఉన్నట్టుండి ఒక్క సారిగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. అయితే ఎంస్ఆర్టీసీకీ చెందిన బస్సుకు ఇలా మంటలు అంటుకోవడం రెండు రోజుల్లో ఇది రెండో సారి.

భారత్‌పై కన్నేసే గట్స్ ఎవరికీ లేవు: కేంద్ర రక్షణ సహాయ మంత్రి

నాసిక్ జిల్లా సిన్నార్ తహసీల్‌లోని మాల్వాడీ శివారు సమీపంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందనీ, అయితే ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ఓ అధికారి తెలిపారు. బస్సు నాసిక్ నుంచి పూణె వైపు వెళ్తోంది. ఈ సమయంలో బస్సు కింద నుంచి పొగలు వచ్చాయి. దీనిని అటుగా వెళ్తున్న ఇతర బస్సు డ్రైవర్లు గమనించారు. వెంటనే శివషాహి బస్సు డ్రైవర్ కు సమాచారం అందించారు. దీంతో డ్రైవర్ అప్రమత్తం అయ్యారు. అందులో ఉన్న 45 మంది ప్రయాణికులను కిందకు దిగాలని కోరారు. దీంతో అందరూ బస్సు దిగిపోయారు. #WATCH | Maharashtra: A state transport (ST) bus caught fire in Pimpalvihir, Amravati today; all 35 passengers who were onboard are safe. pic.twitter.com/6gyFENF8Om

కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ బస్సును మంటలు చుట్టుముట్టాయి. మంటలను ఆర్పేందుకు సిన్నార్ మున్సిపల్ కౌన్సిల్, సిన్నార్ ఎంఐడీసీ నుంచి ఒక్కో అగ్నిపాక దళం అక్కడికి చేరుకుంది. అయితే అప్పటికే బస్సు దగ్ధమైంది. దీనిపై అధికారులు విచారణ చేపడుతున్నారు. 

 

ఇదిలా ఉండగా.. ఒకరోజు ముందు కూడా పూణె నగరంలో ఎంఎస్ ఆర్టీసీకి చెందిన మరో శివషాహి బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న 42 మంది తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. ఈ బస్సు యవత్మాల్ నుంచి పూణెకు వెళ్తుండగా ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఎరవాడలోని శాస్త్రి చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. కాగా.. శివషాహి అనేది ఎంఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సు సర్వీస్. ఈ బస్సులో ఏసీ సౌకర్యం ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios