గురుగ్రామ్: గురుగ్రామలో దారుమైన సంఘటన చోటు చేసుకుంది. పాతికేళ్ల వయస్సు గల మహిళపై నలుగురు ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాల్ గర్ల్ అయిన ఆ మహిళతో నిందితుల్లో ఒకతను ఒప్పందం చేసుకున్నాడు. 

సికిందర్ పూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆమెను కలుసుకున్న నిందితుడు డిఎల్ఎఫ్ ఫే్జ్ 2లోని ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ అప్పటికే ముగురు వేచి ఉన్నారు. వారిని చూసిన బాధితురాలు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. అది గమనించి వారు ఆమెను లాక్కెళ్లారు. 

ఆమె తలను గోడకేసి బాదారు. ఆ తర్వాత నలుగురు కూడా ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఓ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ లో పనిచేస్తుున్నట్లు పోలీసులు తెలిపారు.