ముంబైలో మార్వే క్రీక్ లో మునిగిన ఐదుగురు బాలురు.. ముగ్గురు గల్లంతు.. ఇద్దరిని రక్షించిన స్థానికులు

ముంబైలోని మలాడ్ (పశ్చిమ) మార్వే క్రీక్ లో ముగిని ముగ్గురు బాలులు గల్లంతయ్యారు. ఇద్దరి బాలురలను స్థానికులు రక్షించారు. రెస్క్యూ సిబ్బంది వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

Five boys who drowned in Marve Creek in Mumbai.. 3 were drowned.. 2 were rescued by locals.ISR

ముంబైలోని మలాడ్ (పశ్చిమ)లో విషాదం చోటు చేసుకుంది. మార్వే క్రీక్ లో ఐదుగురు బాలురు మునిగిపోయారు. వారిలో ఇద్దరిని స్థానికులు రక్షించగా.. మిగితా ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. 

సముద్రం ఒడ్డున భర్తతో కలిసి ఫొటో తీసుకుంటుండగా విషాదం.. మహిళను లోపలికి లాక్కెళ్లిన భారీ అల.. వీడియో వైరల్

‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మార్వే క్రీక్ వద్ద సరదాగా గడిపేందుకు 12 నుంచి 16 ఏళ్ల వయస్సున్న ఐదుగురు బాలురు ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే ఉదయం 9.38 గంటల ప్రాంతంలో వారందరూ నీట మునిగారు. దీనిని స్థానికులు గమనించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే స్థానికులు కృష్ణ జితేంద్ర హరిజన్ (16), అంకుష్ భరత్ శివరే (13) అనే ఇద్దరు బాలురను రక్షించారు. మిగితా ముగ్గురు బాలుర కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్ ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటిలో మునిగి గల్లంతైన బాలురను శుభం రాజ్ కుమార్ జైస్వాల్ (12), నిఖిల్ సాజిద్ కయంకుర్ (13), అజయ్ జితేంద్ర హరిజన్ (12)గా గుర్తించారు.

వారి కోసం సిబ్బంది బోటు సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సహాయక చర్యల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, కోస్ట్ గార్డ్, నేవీ డైవర్లు, 108 అంబులెన్స్, వార్డు సిబ్బందిని రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సింధ్ నదిలోకి దూసుకెళ్లిన సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం.. 8 మందికి గాయాలు

కాగా.. గత ఆదివారం కూడా ఇదే ముంబాయిలో దాదాపుగా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. బంద్రా పోర్టులో ఓ మహిళ నీట మునిగి ప్రాణాలు కోల్పోయింది. జూలై 9వ తేదీన జ్యోతి సోనార్ (27) అనే మహిళ తన భర్త, పిల్లలతో కలిసి బంద్రా పోర్టుకు వచ్చింది. ఈ క్రమంలో సముద్రపు ఒడ్డున కూర్చొని తన భర్తతో కలిసి ఫొటోలు దిగుతోంది. అయితే ఆ సమయంలో భారీగా అలలు వచ్చాయి. ఈ విషయాన్ని వారి తెలుపుతూ స్థానికులు హెచ్చరించినా వారు వినిపించుకోలేదు. 

వారెవ్వా.. జాబిల్లిపై భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను ముద్రించనున్న చంద్రయాన్- 3 రోవర్

ఈ క్రమంలో భారీ ఓ అల వచ్చి వారిని ఢీకొట్టింది. దాని తీవ్రతకు భార్యాభర్తలిద్దరూ కింద పడ్డారు. ఆ భారీ అల వెనక్కి వెళ్తూ జ్యోతిని తీసుకెళ్లింది. ఆమెను కాపాడేందుకు భర్త ఎంతో ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ గా మారింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios