Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్‌ లో మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య కాల్పులు.. ఐదుగురు సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలకు గాయాలు..

జార్ఖండ్ లో రాష్ట్రంలోని పశ్చిమ సింగ్ భూమ్ లో నక్సలైట్లకు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. 

Firing between Maoists and security forces in Jharkhand.. Five CRPF Cobra commandos injured..
Author
First Published Dec 2, 2022, 8:50 AM IST

జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలో మావోయిస్టు తిరుగుబాటుదారులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ కు చెందిన ఎలైట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసొల్యూట్ యాక్షన్)కు చెందిన ఐదుగురు కమాండోలు గాయపడ్డారు. ఇందులో ముగ్గురు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయని, వెస్ట్ సింగ్‌భూమ్ ఎస్పీ అశుతోష్ శేఖర్ ‘పీటీఐ’తో తెలిపారు.

వ్యక్తిని, అటకాయించి దాడి చేసిన పోలీసులు... దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని ఢిల్లీ పోలీసులకు కోర్టు ఆదేశాలు...

గాయపడిన భద్రతా సిబ్బందిని రాంచీలోని ఆసుపత్రికి తరలించామని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శేఖర్ తెలిపారు. ఈ కాల్పులు టోంటోలోని అటవీ ప్రాంతంలో జరిగాయని అన్నారు. అయితే మావోయిస్టులు దట్టమైన అడవి గుండా తప్పించుకోగలిగారని ఆయన చెప్పారు. ‘‘ఉదయం నుంచి చైబాసాలో నక్సలైట్లతో జరిగిన రెండు ఘర్షణల్లో ఐదుగురు కోబ్రా సైనికులు గాయపడ్డారు. వారిని హెలికాప్టర్ ద్వారా తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.’’ అని ఆపరేషన్ ఏడీజీ సంజయ్ ఆనందరావు లత్కర్ తెలిపారు.

తండ్రిపై ప‌గ‌తో మైన‌ర్ పై అత్యాచారం చేసి హ‌త్య చేసిన 15 ఏండ్ల బాలుడు

కాగా.. సీఆర్పీఎఫ్, జార్ఖండ్ పోలీసుల సంయుక్త బృందాలు గత రెండు వారాలుగా ఈ ప్రాంతంలో కోటి రూపాయల రివార్డును కలిగి ఉన్న మావోయిస్టు నాయకుడు మిసిర్ బెస్రాను పట్టుకోవడానికి భారీ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి. ఈ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్ (ఐఈడీ)లతో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

డిసెంబ‌ర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలు.. 16 కొత్త బిల్లుల‌ను ప్ర‌వేశపెట్ట‌నున్న కేంద్రం

నవంబర్ 30న ఛత్తీస్ ఘడ్ లోని నేలకంకర్ ప్రాంతంలో 210 మంది కోబ్రా, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. అయితే దట్టమైన అడవి ప్రాంతాన్ని ఉపయోగించుకొని మావోయిస్టులు హడావుడిగా వెనుదిరిగారు. ఈ సోదాల్లో నాలుగు ఆయుధాలు, ఒక ఐఈడీ, ఐఈడీల తయారీకి అవసరమైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.

ఎల్మగుండా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ సమీపంలో 206 కోబ్రా, ఛత్తీస్ ఘడ్ పోలీసులు నిర్వహించిన మరో గస్తీలో ఎఫ్ఓబీకి కేవలం 650 మీటర్ల దూరంలో 5 కిలోల ఐఈడీని గుర్తించారు. ట్రిగ్గరింగ్ కోసం ప్రెజర్ మెకానిజం ఉన్న ఆ ఐఈడీని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios