Asianet News TeluguAsianet News Telugu

వ్యక్తిని, అటకాయించి దాడి చేసిన పోలీసులు... దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని ఢిల్లీ పోలీసులకు కోర్టు ఆదేశాలు...

ఢిల్లీ పోలీసుల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రైవేటు భాగాల్లో తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

Conduct Fair Probe on Assault Case Against Cops Court Directed To Delhi Police
Author
First Published Dec 2, 2022, 8:23 AM IST

న్యూఢిల్లీ : ఓ వ్యక్తి, అతని స్నేహితురాలిపై పోలీసు సిబ్బంది దాడికి పాల్పడ్డారు. సదరు పోలీసు సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఢిల్లీ కోర్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)ని ఆదేశించింది. ఈ దాడికి సంబంధించి పోలీసుల మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన ఢిల్లీలోని సీమా పూరి పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. 

ఈ మేరకు నవంబర్ 24న యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) దాఖలు చేసిఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అంకుర్ పంఘల్ బాధితురాలి తరఫు న్యాయవాది పెట్టిన ఫిర్యాదును గమనించి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు, కేసుకు సంబంధించిన అప్‌డేట్ వివరాల కోసం ఈ కేసును ఫిబ్రవరి 1న విచారించనున్నారు. 

న్యాయవాది మనీష్ భదౌరియా తాను అందించిన పిటిషన్లో.. బాధితులపై దాడి జరిగిన ఇద్దరు పోలీసులు డ్యూటీలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్ లోనే దర్యాప్తు జరుగుతున్నందున ఈ కేసులో పారదర్శకత మీద అనుమానాలు వ్యక్తం చేశారు. 

కౌన్సిల్ కు వచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకున్నామని.. అందులో ఎస్ హెచ్ వోతో పాటు సహా పోలీసు సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలయ్యిందని.. దీని ప్రకారం డీసీపీ నుండి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) సమర్పించాలని నవంబర్ 1న కోర్టు కోరింది.

ఢిల్లీ పోలీసుల దాడిలో బాధితులకు ప్రైవేట్ భాగాలతో పాటు మిగతా చోట్ల తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది సమర్పించిన సమర్పణల దృష్ట్యా, సంబంధిత డీసీపీ నుంచి ఏటీఆర్‌ను పిలవాలని కోర్టు పేర్కొంది. ఫిర్యాదుదారుడు దాఖలు చేసిన ఫిర్యాదుపై ఏదైనా చర్య తీసుకున్నారా? అనే అంశంతో మొదలుపెట్టి ఏటీఆర్ ఫైల్ చేయాలని సంబంధిత డీసీపీని ఆదేశించారు.

ఎస్‌హెచ్‌ఓ సహా పోలీసు అధికారులపై ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది మనీష్ భదౌరియా తెలిపారు. అందువల్ల ఎస్‌హెచ్‌ఓ స్వయంగా నివేదిక తయారు చేయడం సరికాదన్నారు. వేధింపులు, దోపిడీలు, ఇతర సెక్షన్లతో పాటు.. తీవ్రంగా గాయపరచడం వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదుకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది మనీష్ భదౌరియా దరఖాస్తును సమర్పించారు.

ఏం జరిగిందంటే.. ఆగస్ట్ 1, 2022 న, సాయంత్రం 7 గంటల సమయంలో, ఫిర్యాదుదారు తన స్నేహితురాలితో కలిసి వైశాలి నుండి ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లోని వారి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడు, అతని స్నేహితురాలు సీమాపురి అండర్‌పాస్‌ను దాటినప్పుడు, నిందితులలో ఒకరు అకస్మాత్తుగా స్కూటీపై వచ్చి వారిని అడ్డుకుని, బాధితుడి మీద దాడికి దిగారు. ఇష్టారాజ్యంగా కొట్టడం ప్రారంభించాడు. 

తండ్రిపై ప‌గ‌తో మైన‌ర్ పై అత్యాచారం చేసి హ‌త్య చేసిన 15 ఏండ్ల బాలుడు

ఇంతలో, మరో ఇద్దరు పోలీసులు యూనిఫాంలో వచ్చి రెండు చేతులను బలవంతంగా  వెనక్కి విరిచి పట్టుకుని, బాధితుడి కాళ్ళు చాచి, ప్రైవేటు భాగాల్లో తంతూ, గుద్దుతూ దాడి చేశాడని పిటిషన్‌లో పేర్కొంది. మొదటి నిందితుడు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదుదారుడి వృషణాలను మూడు నాలుగు సార్లు తన్నాడు. మరో ఇద్దరు నిందితులు ఫిర్యాదుదారుని చంపేస్తామని బెదిరించారు. అతను 100 నంబర్‌కు డయల్ చేయాలని ప్రయత్నించగా.. ఫోన్ లాక్కున్నారు. 

బాధితుడు నొప్పితో బాధపడుతుండూ విలవిల్లాడిపోతుంటే.. పోలీసులు వారిని అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాలని లేకపోతే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించారు. బాధితుడు తన స్నేహితురాలితో కలిసి నిందితులపై చర్య తీసుకోవాలని కోరుతూ సీమాపురి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే, నిందితులైన పోలీసులపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఆ తరువాత అతని స్నేహితురాలు అతడిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతనికి చికిత్స అందించారు. బాధితుడిని పరీక్షించిన డాక్టర్.. దాడి వల్ల  అతని వృషణాలు కి తీవ్రంగా గాయం పడ్డాయని, చాలా రక్తం పోయిందని, దాని కోసం అతనికి వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, శస్త్రచికిత్స చేస్తే అతని ప్రాణాలకు కొంత ప్రమాదం ఉంటుందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios